హోమ్ /వార్తలు /క్రీడలు /

Arun Lal : 38 ఏళ్ల మహిళతో 66 ఏళ్ల టీమిండియా మాజీ క్రికెటర్ ఘాటు ప్రేమ.. త్వరలోనే పెళ్లి

Arun Lal : 38 ఏళ్ల మహిళతో 66 ఏళ్ల టీమిండియా మాజీ క్రికెటర్ ఘాటు ప్రేమ.. త్వరలోనే పెళ్లి

కాబోయే భార్యతో అరుణ్ లాల్

కాబోయే భార్యతో అరుణ్ లాల్

Arun Lal : భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ అరుణ్ లాల్ (Arun Lal) 66 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అది కూడా 38 ఏళ్ల బెంగాలీ అమ్మాయితో. బెంగాల్ కు చెందిన బుల్ బుల్ సాహా తో అరుణ్ లాల్ వివాహా మే 2వ తేదీన ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రికను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు.

ఇంకా చదవండి ...

Arun Lal : భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ అరుణ్ లాల్ (Arun Lal) 66 ఏళ్ల వయసులో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. అది కూడా 38 ఏళ్ల బెంగాలీ అమ్మాయితో. బెంగాల్ కు చెందిన బుల్ బుల్ సాహా తో అరుణ్ లాల్ వివాహా మే 2వ తేదీన ఘనంగా జరగనుంది. ఇందుకు సంబంధించిన పెళ్లి పత్రికను కూడా ఇప్పటికే సిద్ధం చేశారు. కోల్ కతా (Kolkata) లోని పీర్లెస్ ఇన్ లో మే 2వ తేది సాయంత్రం 7 గంటలకు వీరి వివాహం జరగనుంది. ప్రస్తుతం వీరి వివాహం క్రికెట్ సర్కిల్ లో సంచలనంగా మారింది. ఈ ఇన్విటేషన్ కార్డును అరుణ్ లాల్ ఇప్పటికే తన సన్నిహితులకు పంపాడు కూడా.

ఇది కూడా చదవండి :ఐపీఎల్ లో వింత.. హెడ్ మాస్క్ తో పంజాబ్ కింగ్స్ బౌలర్.. దాని ఉపయోగాలు తెలిస్తే మీరు వావ్ అనాల్సిందే..

అరుణ్ లాల్ ప్రస్తుతం బెంగాల్ క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా పనిచేస్తున్నారు. అరుణ్ లాల్ మొదటి భార్య దేబ్జనీ లాల్ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెను ఒప్పించి మరీ అరుణ్ లాల్ రెండో పెళ్లిని చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే అరుణ్ లాల్ మొదటి భార్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. దాంతో అరుణ్ లాల్ ఆమెకు ఇది వరకే విడాకులు కూడా ఇచ్చినట్లు సమాచారం. అయితే ఆమె ఆనారోగ్య పరిస్థితుల దృష్ట్యా అరుణ్ లాల్ వద్దే ఆమె ఉంటున్నారు. అరుణ్ లాల్ మొదటి భార్యకు బుల్ బుల్ సాహాతో మంచి సంబంధాలే ఉన్నట్లు సమాచారం

అరుణ్‌ లాల్‌ భారత్ తరఫున 1982-89 మధ్యకాలంలో 16 టెస్టులు, 13 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 729 పరుగులు చేసిన అతడు.. వన్డేల్లో122 పరుగులు చేశాడు. అంతర్జాతీయ కెరీర్ లో అరుణ్ లాల్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. అయితేఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మాత్రం మెరుగ్గా ఆడాడు. 156 మ్యాచ్‌ల్లో 30 శతకాలు, 43 అర్ధ శతకాలతో 10,424 పరుగులు చేశాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కామెంటేటర్ గా కోచ్ గా అతడు స్థిరపడ్డాడు. అయితే కొందరు వీరి పెళ్లిపై ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. అంత ఏజ్ గ్యాప్ ఉన్న మహిళతో పెళ్లి ఏంటంటూ అరుణ్ లాల్ ను ఏకిపారేస్తున్నారు.

First published:

Tags: Chennai Super Kings, Cricket, IPL, IPL 2022, Kolkata, MS Dhoni, Rajasthan Royals, Royal Challengers Bangalore, Team India, Virat kohli, West Bengal

ఉత్తమ కథలు