Home /News /sports /

CRICKET VIRAL NEWS SCOOTER STOPS PLAY DURING CRICKET MATCH VIDEO GOES VIRAL SJN

Cricket Viral News : ఓరి నీ దుంప తెగ..స్కూటర్ ఎక్కడ నడపాలో కూడా తెలీదా.? పిచ్ పైకి దూసుకొచ్చిన బుడతడు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

పిచ్ పై హల్చల్ చేస్తోన్న కుర్రాడు (PC : TWITTER)

పిచ్ పై హల్చల్ చేస్తోన్న కుర్రాడు (PC : TWITTER)

Cricket Viral News : వర్షం వల్లనో.. ఫ్లడ్ లైట్స్ ఆగిపోవడం వల్లనో క్రికెట్ మ్యాచ్ లకు అప్పుడప్పుడు అంతరాయం కలుగుతుంది. కొన్ని సార్లు మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆకతాయి అభిమానులు గ్రౌండ్ లోకి దూసుకుపోవడం వల్ల కూడా మ్యాచ్ కు అంతరాయం కలుగుతుంది.

ఇంకా చదవండి ...
Cricket Viral News : వర్షం వల్లనో.. ఫ్లడ్ లైట్స్ ఆగిపోవడం వల్లనో క్రికెట్ మ్యాచ్ లకు అప్పుడప్పుడు అంతరాయం కలుగుతుంది. కొన్ని సార్లు మ్యాచ్ చూడటానికి వచ్చిన ఆకతాయి అభిమానులు గ్రౌండ్ లోకి దూసుకుపోవడం వల్ల కూడా మ్యాచ్ కు అంతరాయం కలుగుతుంది. అయితే ఒక కౌంటీ మ్యాచ్ లో ఓ బుడతడు చేసిన పని వల్ల మ్యాచ్ ఆగిపోయింది. ఆ మ్యాచ్ ఎక్కడ జరిగిందో చెప్పడానికి సరైన వివరాలు లేవు కానీ, ఓ కుర్రాడు మ్యాచ్ జరుగుతున్న సమయంలో తన స్కూటర్ తో మైదానంలోకి దూసుకొని వచ్చాడు. అంతేకాకుండా.. పిచ్ పై నడుపుతూ హల్చల్ చేశాడు. ప్లేయర్లు, అంపైర్లు ఉన్నా ఆ బుడతడు చేసే పనిని చూస్తు ఉండిపోయేరే తప్ప ఏం చేయలేదు.

ఇది కూడా చదవండి  : అంపైర్ ను కొట్టరాని చోట కొట్టిన పొలార్డ్.. నవ్వాపుకోలేకపోయిన రోహిత్ శర్మ.. అసలేం జరిగిందంటే?

పిచ్ పైకి స్కూటర్ (మన దేశంలో నడిపే చేతక్ స్కూటర్ లాంటిది కాదు)తో దూసుకొచ్చిన ఆ కుర్రాడు కాసేపు తన బైక్ ను అటు ఇటు తప్పి ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు వెళ్లేంత వరకు మ్యాచ్ ను ఆపేసిన ప్లేయర్స్ కుర్రాడు వెళ్లిపోగానే మళ్లీ మ్యాచ్ ను ఆరంభించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి మరీ.



ఇండియాలో కూడా ఒకసారి ఇటువంటి సంఘటనే జరిగింది. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీ, యూపీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్న సమయంలో గ్రౌండ్ లోకి ఒక కార్ దూసుకొచ్చింది. పిచ్ పై దూసుకుంటూ వెళ్లింది.  ఆ మ్యాచ్ లో ఢిల్లీ తరఫున గౌతం గంభీర్ కూడా ఆడటం విశేషం.



క్రికెట్ లో అప్పుడప్పుడు ఇటువంటి ఊహించన సంఘటనలు జరుగుతుంటాయి. చూడటానికి  ఇవి ఫన్నీగా కనిపించినా కూడా.. భద్రతాలోపాలను బయటపెట్టాలా ఉంటాయి. ఇకపై అయినా ఐసీసీ మ్యాచ్ జరిగే ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతను కల్పించాల్సిన అవసరం ఉంది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cricket, IPL, IPL 2022, Kieron pollard, MS Dhoni, Mumbai Indians, Rohit sharma, Viral Videos, Virat kohli

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు