హోమ్ /వార్తలు /క్రీడలు /

Hasan Ali : అసలేం జరిగింది.. పాక్ బౌలర్ దెబ్బకు షాక్ లో ఇంగ్లండ్ బ్యాటర్.. యార్కర్ కు ఆ స్టంప్..

Hasan Ali : అసలేం జరిగింది.. పాక్ బౌలర్ దెబ్బకు షాక్ లో ఇంగ్లండ్ బ్యాటర్.. యార్కర్ కు ఆ స్టంప్..

హసన్ అలీ (PC: TWITTER)

హసన్ అలీ (PC: TWITTER)

Hasan Ali :  ఇంగ్లండ్ (England) వేదికగా జరగుతోన్న కౌంటీ క్రికెట్ లో  ఆ దేశ ప్లేయర్స్ కంటే కూడా విదేశీ ప్లేయర్స్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. సస్సెక్స్ జట్టు తరఫున ఆడుతోన్న భారత టెస్టు బ్యాటర్ చతేశ్వర్ పుజారా (cheteshwar pujara) సెంచరీల మీద సెంచరీలు బాదుతుంటే.. పాకిస్తాన్ పేసర్ హసనల్ అలీ (Hasan Ali) తన పదునైన బంతులతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.

ఇంకా చదవండి ...

Hasan Ali :  ఇంగ్లండ్ (England) వేదికగా జరగుతోన్న కౌంటీ క్రికెట్ లో  ఆ దేశ ప్లేయర్స్ కంటే కూడా విదేశీ ప్లేయర్స్ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. సస్సెక్స్ జట్టు తరఫున ఆడుతోన్న భారత టెస్టు బ్యాటర్ చతేశ్వర్ పుజారా (cheteshwar pujara) సెంచరీల మీద సెంచరీలు బాదుతుంటే.. పాకిస్తాన్ పేసర్ హసనల్ అలీ (Hasan Ali) తన పదునైన బంతులతో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. హసన్ అలీ లంకషైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రస్తుతం గ్లౌస్టర్ షైర్, లంకషైర్ జట్ల మధ్య నాలుగు రోజుల పాటు జరిగే మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో ఆట మూడో రోజు హసన్ అలీ తన పేస్ పదునును  ప్రత్యర్థి బ్యాటర్లకు చూపించాడు.

ఇది కూడా చదవండి : సన్ రైజర్స్ ను చూసి తీన్ మార్ ఆడుతోన్న కావ్య .. ఫోటోలు వైరల్..

మూడోరోజు ఆటలో భాగంగా ఆదివారం గ్లూస్టర్‌షైర్‌ బ్యాటర్‌ జేమ్స్‌ బ్రేసీ (14) ని క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. 25వ ఓవర్ వేయడానికి వచ్చిన హసన్ అలీ.. ఆ ఓవర్ ఆఖరి బంతిని 145 కి.మీ వేగంతో బ్రేసీ ఆడలేని విధంగా యార్కర్ వేశాడు. రాకెట్ వేగంతో గాల్లోనే స్వింగ్ అవుతూ వచ్చిన ఆ బంతిని ఎలా ఆడాలో తెలియక తికమక పడిన బ్రేసీ క్లీన్ బౌల్డ్ అయ్యి పెవిలియన్ కు చేరుకున్నాడు. అయితే హసన్ అలీ దెబ్బకు మిడిల్ స్టంప్ సగానికి విరిగిపోయింది. విరిగిపోయిన స్టంప్ గాల్లో పల్టీలు కొడుతూ చాలా దూరం ఎగిరి పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన లంకషైర్ జట్టు.. ’కొత్త స్టంప్ ను తెప్పించాల్సిందే‘ అంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. హసన్ అలీ తొలి ఇన్నింగ్స్ లో 47 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్ లో ఒక వికెట్ తీశాడు. మ్యాచ్ కు నేడు చివరి రోజు. తొలుత బ్యాటింగ్ చేసి గ్లౌస్టర్ షైర్ హసన్ అలీ దెబ్బకు 252 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన లంకషైర్ 7 వికెట్లకు 556 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్ మొదలు పెట్టిన గ్లౌస్టర్ షైర్ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 67 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ఓటమిని తప్పించుకోవాలంటే ఆ జట్టు మరో 237 పరుగులు చేయాల్సి ఉంది. మరో నాలుగు వికెట్లు తీస్తే ఒక మ్యాచ్ లో 10 వికెట్ల మైలురాయిని హసన్ అలీ అందుకుంటాడు.

Published by:N SUJAN KUMAR REDDY
First published:

Tags: Cheteswar Pujara, Cricket, England, IPL, IPL 2022, Lucknow Super Giants, Mumbai Indians, Pakistan, Sachin Tendulkar, Sunrisers Hyderabad

ఉత్తమ కథలు