CRICKET VIRAL NEWS FIELD UMPIRE TAKES SHOCKING DECISION TO GIVE OUT VIDEO GOES VIRAL AND FANS TROLLING THAT UMPIRE SJN
Cricket Viral : ’ఎవడ్రా వీడికి అంపైర్ గా అవకాశం ఇచ్చింది.. కళ్లను జేబులో పెట్టుకొని అంపైరింగ్ చేస్తున్నాడా’..
కౌంటీ క్రికెట్ లో అంపైర్ తప్పుడు నిర్ణయం (PC: TWITTER)
Cricket Viral : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఆటగాళ్ల మెరుపుల కంటే కూడా అంపైర్ల తప్పుడు నిర్ణయాలు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. విలియమ్సన్ క్యాచ్, స్టొయినస్ వైడ్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్ (Rajasthan Royals) బౌలర్ మెకాయ్ వేసిన హై ఫుల్ టాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది ఐపీఎల్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు కొదవలేకుండా పోతుంది.
Cricket Viral : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో ఆటగాళ్ల మెరుపుల కంటే కూడా అంపైర్ల తప్పుడు నిర్ణయాలు ఎక్కువగా హైలైట్ అవుతున్నాయి. విలియమ్సన్ క్యాచ్, స్టొయినస్ వైడ్, ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తో జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్ (Rajasthan Royals) బౌలర్ మెకాయ్ వేసిన హై ఫుల్ టాస్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాది ఐపీఎల్ లో అంపైర్ల తప్పుడు నిర్ణయాలకు కొదవలేకుండా పోతుంది. సాంకేతికత అందుబాటులో ఉన్నా కూడా అంపైర్లు ఇలా తప్పుడు నిర్ణయాలతో బ్యాటర్లను బలి చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా ఐపీఎల్ కు మించిన తప్పుడు నిర్ణయం ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న కౌంటీ డివిజన్ 1 క్రికెట్ లో నమోదైంది.
కౌంటీ క్రికెట్ లో భాగంగా ఈ నెల 24న ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. కెంట్, హంప్ షైర్ జట్ల మధ్య మ్యాచ్ జరగ్గా.. కెంట్ జట్టు రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో ఈ సంఘటన జరిగింది. కెంట్ బ్యాటర్ జొర్డాన్ కాక్స్ బ్యాటింగ్ చేస్తోండగా ఆర్గాన్ వేసిన బంతిని ప్యాడ్లతో అడ్డుకనే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో బంతి అతడి ఎడమ కాలిని తగిలి షార్ట్ లెగ్ లో ఉన్న ఫీల్డర్ చేతుల్లో పడింది. వెంటనే బౌలర్ అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటంటూ ప్రకటించాడు. అయితే ఇక్కడ బంతి బ్యాట్ కు ఎక్కడా తగల్లేదు. అయినా కూడా అంపైర్ అవుటంటూ ప్రకటించగా.. జొర్డాన్ జీర్ణించుకోలేకపోయాడు. ఇక నాన్ స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న స్టీవెన్స్ అయితే అంపైర్ నిర్వాకానికి తలను దించుకొనే ఉన్నాడు. జొర్డాన్ రెండు ఇన్నింగ్స్ ల్లోనూ అర్ధ సెంచరీలు సాధంచాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
— LV= Insurance County Championship (@CountyChamp) April 24, 2022
అంపైర్ అవుటని ప్రకటించడంతో షాక్ తిన్న జొర్డాన్ కొన్ని సెకన్ల పాటు క్రీజులో అలానే ఉండిపోయాడు. ఇక ఈ వీడియోను చూసిన క్రికెట్ లవర్స్ ఫీల్డ్ అంపైర్‌ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ''ఎంత చెత్త అంపైరింగ్.. మరి ఇంత దారుణమా.. నీకు ఎవడ్రా అంపైరింగ్ ఇచ్చింది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఫ్యాన్స్ కు ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్లు బెన్ స్టోక్స్, లివింగ్‌స్టోన్‌లు కూడా జత కలిశారు. తప్పుడు నిర్ణయం ఇచ్చిన అంపైర్‌కు తమదైన శైలిలో ట్రోల్ చేశారు. ఇక ఐస్‌లాండ్ క్రికెట్ అయితే ఒక అడుగు ముందుకు వేసి.. ఐపీఎల్ కంటే కూడా ఇంగ్లండ్ లో జరిగే కౌంటీ మ్యాచ్ లకు వెంటనే తమ అంపైర్లను పంపాలంటూ చురకలంటించింది. ఐపీఎల్ లో అంపైర్ల నుంచి తప్పుడు నిర్ణయాలు రావడంతో.. తమ దగ్గర ట్రయిన్ అయిన అంపైర్లు ఉన్నారని ఐపీఎల్ లో అవకాశం ఇవ్వాల్సిందిగా ట్వీట్ చేసింది. తాజాగా కౌంటీ క్రికెట్ లో అంపైర్ దారుణమైన నిర్ణయం తీసుకోవడంతో ఐపీఎల్ కంటే ముందుగా కౌంటీలకు తమ అంపైర్లను పంపించాలంటై ఐస్ లాండ్ క్రికెట్ ట్వీట్ చేసింది.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.