Sonal Chauhan | KL Rahul | సోనాల్ చౌహాన్‌తో కేఎల్ రాహుల్ ప్రేమలో పడ్డట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో ఈ బ్యూటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘నాకు రాహుల్‌తో ఎలాంటి సంబంధం లేదు. అతడు మంచి క్రికెటర్. టాలెంటెడ్, నైస్ పర్సన్’ అంటూ స్పష్టం చేసింది.
కేఎల్ రాహుల్.. క్రికెట్లో కంటే మిగతా విషయాల్లోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఆ మధ్య మహిళల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి బీసీసీఐ వేటుకు గురైన ఇతడు.. పలువురు బాలీవుడ్ భామలతో లవ్‌లో ఉన్నాడని అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. మోడల్ ఎలిక్సర్ నహర్, కథానాయికలు సోనమ్ బజ్వా, ఆథియా శెట్టి, నిధి అగర్వాల్‌తో వేర్వేరు సందర్భాల్లో ప్రేమలో మునిగినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆకాంక్ష రంజన్ కపూర్ అనే అమ్మాయితో డేటింగ్లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
కేఎల్ రాహుల్‌తో ఆకాంక్ష (Image: Twitter)
దీనిపైనే ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాహుల్ ను ఆకాంక్ష గురించి అడగ్గానే అది తన వ్యక్తిగత విషయమని, అనవసరంగా మీడియా సంస్థలు రాద్ధాంతం చేస్తున్నాయని రాహుల్ వాపోయాడు. అంతేకాదు పర్సనల్ విషయాలు షేర్ చేసుకునేందుకు ఇష్టపడనని, పబ్లిక్‌లో ప్రైవేట్ విషయాలు చర్చించనని రాహుల్ దాటవేశాడు. తాను ఎలాంటి రిలేషన్షిప్లో ఉన్నానో తెలీదని, కెరీర్ పాడయ్యేలా చేయవద్దని రాహుల్ మీడియాను కోరాడు.
అయితే, తాజాగా.. ఇతగాడు సోనాల్ చౌహాన్‌తో ప్రేమలో పడ్డట్లు వార్తలు జోరందుకున్నాయి. దీంతో ఈ బ్యూటీ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ‘నాకు రాహుల్‌తో ఎలాంటి సంబంధం లేదు. అతడు మంచి క్రికెటర్. టాలెంటెడ్, నైస్ పర్సన్’ అంటూ స్పష్టం చేసింది.
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.