Cricket: గంగూలీ, సెహ్వాగ్ టీమిండియా కోచ్ కాలేరు...ఎందుకో తెలుసా?

Team India Head Coach: రవిశాస్త్రిని పక్కనబెట్టి ప్రధాన కోచ్‌గా గంగూలీ లేదా సెహ్వాగ్‌కు అవకాశం ఇవ్వాలని పలువురు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, బీసీసీఐ విధించిన నిబంధనలు వారికి అడ్డుగా మారాయి. అవి అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 18, 2019, 1:16 PM IST
Cricket: గంగూలీ, సెహ్వాగ్ టీమిండియా కోచ్ కాలేరు...ఎందుకో తెలుసా?
గంగూలీ (File)
  • Share this:
వరల్డ్ కప్ సమరం ముగిసింది. సెమీ ఫైనల్‌లోనే న్యూజిలాండ్ చేతిలో ఓడిన భారత్ ఇంటిముఖం పట్టింది. సెమీస్‌లోనే టీమిండియా వెనుదిరగడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రస్తుత హెడ్ కోచ్ రవిశాస్త్రి మధ్య విభేదాలు ఉన్నాయని, దాని ప్రభావం టీమ్‌పై పడిందని ఊహాగానాలు వినిపించాయి. దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు. కాగా, టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం వరల్డ్ కప్‌తోనే ముగిసింది. అయితే, మరో 45 రోజుల పాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ లోగా కొత్త కోచ్‌ కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తోంది. ప్రధాన కోచ్ ఒక్కరే కాకుండా, బ్యాటింగ్ కోచ్, బౌలింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్, ఫిజియో, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్, అడ్మిన్ మేనేజర్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.

రవిశాస్త్రిని పక్కనబెట్టి ప్రధాన కోచ్‌గా గంగూలీ లేదా సెహ్వాగ్‌కు అవకాశం ఇవ్వాలని పలువురు క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. అయితే, బీసీసీఐ విధించిన నిబంధనలు వారికి అడ్డుగా మారాయి. అవి అభిమానులను నిరాశకు గురిచేస్తున్నాయి.

బీసీసీఐ విధించిన నిబంధనలు ఇవీ..
1. కనీసం రెండేళ్ల పాటు టెస్టు టీమ్‌కు ప్రధాన కోచ్‌గా పనిచేసి ఉండాలి. లేదా.. ఐపీఎల్, అంతర్జాతీయ లీగ్‌లు, ఫస్ట్ క్లాస్ టీమ్‌లు, జాతీయ ఏ జట్టుకు ప్రధాన కోచ్‌గా కనీసం మూడేళ్ల పాటు పని చేసి ఉండాలి.
2. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడి ఉండాలి. లేదా.. బీసీసీఐ లెవల్-3 సర్టిఫికేషన్ కలిగి ఉండాలి.
3. వయో పరిమితి 60 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి.

ఈ నిబంధనల్లో.. రెండు నిబంధనలతో గంగూలీ, సెహ్వాగ్‌కు ఇబ్బంది లేదు. కాకపోతే.. తొలి నిబంధనే వారికి అడ్డుగా మారుతోంది. ఎందుకంటే.. వీరిద్దరు ఏ అంతర్జాతీయ జట్టుకు కూడా కోచ్‌గా పనిచేయలేదు. పోనీ.. ఐపీఎల్‌లో పనిచేశారా? అంటే.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు కొన్ని రోజుల పాటే పనిచేశాడు. అదీ హెచ్ కోచ్‌గా కాదు. ఇక, గంగూలీ విషయానికి వస్తే.. 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు మెంటార్‌గా పనిచేసిన అనుభవం మాత్రమే ఉంది. అంటే.. వీరిద్దరు ప్రధాన కోచ్ పదవికి అర్హులు కాదన్న మాట.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 18, 2019, 1:16 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading