వెస్టిండీస్ పర్యటనను టీమిండియా సంపూర్ణంగా ముగించింది. ముందు టీ20, తర్వాత వన్డే.. తాజాగా టెస్టు సిరీస్‌నూ క్లీన్ స్వీప్ చేసి పర్యటనను పరిపూర్ణం చేసేసింది. విండీస్‌కు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా మూడు సిరీస్‌ల్లోనూ దుమ్ముదులిపేసింది. కింగ్స్టన్లోని సబినా పార్క్ వేదికగా రెండో టెస్టులో వెస్టిండీస్‌పై టీమిండియా 257 పరుగుల భారీ తేడాతో మరో ఘన విజయాన్ని సాధించింది. 468 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన విండీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 210 పరుగులకే చాప చుట్టేసింది. 45/2తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ప్రత్యర్థి జట్టు భారత బౌలర్ల ధాటికి దాసోహమైంది. జడేజా(3/58), షమి(3/65), ఇషాంత్ (2/37) బంతితో రెచ్చిపోయారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్.. విండీస్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసింది. ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీసేన 54.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 168 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఈ టెస్టు సిరీస్ విజయంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీసేన 120 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
ఇదిలా ఉండగా, టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ను ఐసీసీ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే, అంతర్జాతీయ క్రికెట్లో రెండో కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా బ్లాక్‌వుడ్ నిలిచాడు. టెస్టు షెడ్యూల్ ప్రకారం తుది 15 మంది సభ్యులతో కూడిన విండీస్ జట్టులో బ్లాక్‌వుడ్ చోటు లేకపోయినప్పటకీ ఐసీసీ నిబంధనల వల్ల అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం దొరికింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.