Ambati Rayudu: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు..

Ambati Rayudu Announces Retirement: ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు రాయుడు ప్రకటించాడు. ఈ మేరకు బీసీసీఐకి మెయిల్ ద్వారా తన రిటైర్మెంట్‌ను తెలియజేశాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 3, 2019, 1:57 PM IST
Ambati Rayudu: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడు..
అంబటి రాయుడు(ఫైల్ ఫోటో)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 3, 2019, 1:57 PM IST
ప్రముఖ క్రికెటర్, తెలుగు బిడ్డ అంబటి రాయుడు క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ సహా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ఈ రోజు ప్రకటించాడు. ఈ మేరకు బీసీసీఐకి మెయిల్ ద్వారా తన రిటైర్మెంట్‌ను తెలియజేశాడు. కాగా, వరల్డ్ కప్ టీమిండియా జట్టులో తనకు చోటు లభిస్తుందని రాయుడు భావించాడు. కానీ సెలెక్టర్లు అతడికి మొండిచేయి చూపారు. అదీకాక, గాయపడ్డ ధవన్, విజయ్ శంకర్ స్థానాల్లోనూ చోటు దక్కుతుందని ఆశపడ్డా.. వారి స్థానాల్లో రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్‌కు చోటిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై రిటైర్మెంట్ ప్రకటించినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

55 వన్డే మ్యాచ్‌లు ఆడిన రాయుడు.. 47.05 యావరేజ్‌తో 1694 పరుగులు చేశాడు. అందులో 3 సెంచరీలు, 10 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో మాత్రం ఎప్పుడూ చోటు దక్కలేదు. గత ఐపీఎల్‌లో ధోని నేతృత్వంలోని చెన్నై తరఫున కూడా ఆడాడు.

అయితే, వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రాయుడు.. తొలినాళ్లలోనే అప్పటి హెచ్‌సీఏ బాస్ శివ్‌పాల్ యాదవ్‌పై ఆరోపణలు చేశాడు, ఆ తర్వాత బీసీసీఐ బ్యాన్ చేసిన ఐసీఎల్ తరఫున ఆడాడు. ఇక, ఈ వరల్డ్ కప్ కోసం జట్టును ప్రకటించాక.. తాను సెలెక్ట్ కాలేదని తెలిసి.. బీసీసీఐకి చురక అంటించే ట్వీట్ చేశాడు. ఈ వరల్డ్ కప్ చూడ్డానికి 3డీ గ్లాసెస్ ఆర్డర్ చేశానని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ ట్వీట్ కారణంగానే గరం గరంగా ఉన్న బీసీసీఐ అతడ్ని జట్టులోకి తీసుకొని ఉండకపోవచ్చని పలువురు క్రీడా విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.





First published: July 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...