విరాట్ కోహ్లీ బయోపిక్ సిద్ధం.. హీరో ఎవరో తెలిస్తే షాక్..

Virat Kohli: ఇప్పటికే ఇండియన్ టీం నుంచి అజార్, ధోనీ, సచిన్ బయోపిక్స్ విడుదలయ్యాయి. అందులో ధోనీ బయోపిక్ సంచలన విజయం సాధించింది కూడా. ఇక కపిల్ దేవ్ బయోపిక్ కానీ బయోపిక్ 83..

Praveen Kumar Vadla | news18-telugu
Updated: May 18, 2020, 8:30 PM IST
విరాట్ కోహ్లీ బయోపిక్ సిద్ధం.. హీరో ఎవరో తెలిస్తే షాక్..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli Biopic)
  • Share this:
ఇండస్ట్రీతో పని లేకుండా అన్నిచోట్లా ఇప్పుడు బయోపిక్స్ ట్రెండ్ బాగా నడుస్తుంది. అందులోనూ స్పోర్ట్స్ పర్సన్ బయోపిక్స్ అంటే క్రేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇప్పటికే ఇండియన్ టీం నుంచి అజార్, ధోనీ, సచిన్ బయోపిక్స్ విడుదలయ్యాయి. అందులో ధోనీ బయోపిక్ సంచలన విజయం సాధించింది కూడా. ఇక కపిల్ దేవ్ బయోపిక్ కానీ బయోపిక్ 83 విడుదలకు సిద్ధంగా ఉంది. ఇది అప్పట్లో కపిల్ డెవిల్స్ సాధించిన విజయానికి ప్రతీక. ఇందులో ఎక్కువగా కపిల్ భావాలే కనిపిస్తాయని చెప్పాడు దర్శకుడు కబీర్ ఖాన్.
రణ్‌వీర్, దీపిక (Ranveer singh Deepika)
రణ్‌వీర్, దీపిక (Ranveer singh Deepika)


ఇదిలా ఉంటే ఇప్పుడు ఇండియన్ టీం కెప్టెన్ విరాట్ కోహ్లీ బయోపిక్ కూడా సిద్ధమవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. సచిన్ వారసుడిగా ప్రస్తుతం కోహ్లీకి పేరుంది. సమకాలీన క్రికెటర్స్‌లో ఎవరూ సాధించలేని.. కలలో కూడా ఊహించలేని రికార్డులను సెట్ చేసాడు విరాట్. ఈయనకు కోట్లాది మంది అభిమానులున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్లలో కోహ్లీ కూడా ఒకడు. ఇదిలా ఉంటే త్వరలో ఈయన బయోపిక్ రాబోతుందని తెలుస్తుంది.
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ (Virat Kohli Anushka Sharma)
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ (Virat Kohli Anushka Sharma)

ఇందులో హీరో ఎవరో తెలిస్తే షాక్ తప్పదు.. ఎందుకంటే కోహ్లీ స్వయంగా తన బయోపిక్‌పై స్పందించాడు. తన బయోపిక్ తీస్తే తనే హీరోగా ఉంటానని.. హీరోయిన్‌గా మాత్రం తన భార్య అనుష్క శర్మ ఉండాలని కండీషన్ పెట్టాడు ఈయన. మరి కోహ్లీ చెప్పిన కండీషన్‌కు ఓకే చెప్పి ఈయనతో బయోపిక్ తీసే దర్శకుడు ఎక్కడున్నాడో చూడాలిక.
First published: May 18, 2020, 8:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading