INDvPAK: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ సమయంలో వర్షం పడుతుందా? దుబాయ్ వెదర్ ఎలా ఉందంటే..

బాబర్ అజామ్, విరాట్ కొహ్లీ

India Vs Pakistan: దుబాయ్‌లో వాతావరణం పూర్తి అనుకూలంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఎలాంటి మేఘాలు లేవు. సాయంత్రం ఉష్ణోగ్రత 31 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశముంది.

 • Share this:
  ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ (India Pakistan cricket match). క్రికెట్ చరిత్రలో ఈ క్రీడా సమరానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇరుదేశాల ఫ్యాన్స్‌ పూనకాలతో ఊగిపోతారు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ... అన్ని పనులను పక్కన బెట్టేసి టీవీలకు అతుక్కుపోతారు. మా వాళ్లే గెలవాలని దేవుడికి మొక్కుతారు. పూజలు చేస్తారు. గ్రౌండ్ సిక్స్ కొట్టారంటే సంబరాలు.. వికెట్ పడిందంటే ఆగ్రహావేశాలు... ఎక్కడ చూసినా ఇలాంటి సీన్లే కనిపిస్తాయి. ఇక మ్యాచ్ గెలిస్తే ఆ కిక్కే వేరు. ఆ ఆనందమే వేరు..! ఏకంగా టైటిల్ గెలిచేసినట్లుగా దేశవ్యాప్తంగా వేడుకుల జరుగుతాయి. డప్పుల మోతలు.. బాణాసంచా వెలుగులతో.. దీపావళి చేసుకుంటారు. మళ్లీ అలాంటి క్షణాలు వచ్చాయి. క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. అసలు సిసలు క్రీడా వినోదాన్ని పంచే దాయాదుల సమరానికి సర్వం సిద్ధమయింది. టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)లో భాగంగా దుబాయ్ (Dubai) వేదికగా ఇవాళ పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ రాత్రి 07.30కు ప్రారంభం కానుంది.

  వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇప్పటి వరకూ భారత్‌దే పైచేయి. ఒక్కసారి కూడా మెన్ ఇన్ బ్లూ ఓడిపోలేదు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టును ఐదుసార్లు ఓడించింది. ఆరోసారి కూడా గెలిచి పాకిస్తాన్‌పై జైత్రయాత్రను కొసాగించాలని విరాట్ కొహ్లీ(Virat Kohli) సేన భావిస్తోంది. అది జరగాలంటే ముందు మ్యాచ్ జరగాలి. మ్యాచ్ ఎలాంటి ఆటంకం లేకుండా ముగియాలంటే వాతావరణం సహకరించాలి. మరి ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ వేళ దుబాయ్ వాతావరణం ఎలా ఉందన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అక్కడి వాతావరణం ఎలా ఉందో ఓసారి చూద్దాం.

  India Vs Pakistan : ఈ పాకిస్థాన్ క్రికెటర్ల భార్యలకు, భారత్ తో ఉన్న లింకులు  ఇవే

  దుబాయ్‌లో వాతావరణం పూర్తి అనుకూలంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. ఎలాంటి మేఘాలు లేవు. సాయంత్రం ఉష్ణోగ్రత 31 డిగ్రీల మేర నమోదయ్యే అవకాశముంది. దుబాయ్‌లో దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు గంటకు 7 కి.మీ. వేగంతో గాలులు వీస్తున్నాయి. వర్షం పడే అవకాశాలు అస్సలు లేవని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. సాయంత్రం గాల్లో తేమ శాతం 70 వరకు ఉంటుందని వెల్లడించారు. ఇది క్రికెట్ మ్యాచ్‌కు పూర్తిగా అనుకూలింతే వాతవరణం అని స్పష్టం చేశారు.

  టీ-20ల్లో రెండు జట్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు వీళ్లే..! లిస్ట్ లో మనోడే  టాప్

  టాస్ ఎంతో కీలకం:
  అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లో టాస్ కూడా కీలకం కానుంది. గత ఐపీఎల్ సీజన్‌తో పోల్చితే దుబాయ్‌ వాతావరణంలో ఈసారి కాస్త మార్పు కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రత తగ్గింది.. సాయంత్రం వేళ డ్యూ ఫ్యాక్టర్ (తేమ) కూడా మ్యాచ్ గెలుపునపై ప్రభావం చూపే అవకాశముంది. 2020 ఐపీఎల్ తొలి అర్ధ భాగంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే 77శాతం గెలిచాయి. కానీ రెండో అర్ధభాగంలో పరిస్థితి మారింది. 77శాతం చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మరి టాస్ ఎవరు గెలుస్తారో? విరాట్ కొహ్లీ, బాబర్ అజామ్ ఎలాంటి నిర్ణయ తీసుకుంటారన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల్లో దుబాయ్ పిచ్‌పై సగటున 150-160 స్కోర్ నమోదయింది. ఫాస్ట్ బౌలర్లే అధిక వికెట్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్టు ముగ్గురు పేసర్ల చొప్పున బరిలోకి దింపే అవకాశముంది. ఏదేమైనా ఈ మ్యాచ్‌పై ఇండియా, పాకిస్తాన్‌లోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: