ICC Men's T20 World Cup: గాలిలో దూకి, ఒంటి చేతితో పట్టి.. ఇది కదా క్యాచ్ అంటే!

dasun-shanaka

దాదాపు 33 సెకన్ల కూడిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. నమీబియా ఇన్నింగ్స్ 19 వ ఓవర్‌లో చమీరా బౌలింగ్ ట్రంపెల్‌మన్ మిడ్-ఆఫ్ వైపుగా ఆడిన బంతిని దాసున్ అద్భుత క్యాచ్‌గా మలిచాడు. క

  • Share this:


    దుబాయ్: టీ 20 ప్రపంచకప్ ఉత్సాహం మెుదలైంది. రోజు రోజుకు మ్యాచ్‌లపై అభిమానులకు ఆసక్తి పెరుగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌ విన్యాసాలకు వేదికగా మారుతుంది. సోమవారం శ్రీలంక ,నమీబియా మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కానీ శ్రీలంక విజయం కంటే, కెప్టెన్ దాసున్ శనక క్యాచే ఇక్కడ హైలెట్‌గా నిలిచింది. ఆ క్యాచ్ పట్టిన తీరును చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.










    View this post on Instagram






    A post shared by ICC (@icc)






    దాదాపు 33 సెకన్ల కూడిన ఈ వీడియో అభిమానులను ఆకట్టుకుంటుంది. నమీబియా ఇన్నింగ్స్ 19 వ ఓవర్‌లో చమీరా బౌలింగ్ ట్రంపెల్‌మన్ మిడ్-ఆఫ్ వైపుగా ఆడిన బంతిని దాసున్ అద్భుత క్యాచ్‌గా మలిచాడు. కవర్‌ వైపుగా ఫీల్డిండ్ చేస్తున్న శనక అమాంతం గాల్లోకి ఎగిరి ఒక చేతితో క్యాచ్ తీసుకున్నాడు. క్యాచ్ తీసుకున్న తర్వాత కూడా, చాలా దూరం అలా జారుతూనే వెళ్ళాడు. క్యాచ్ చూసిన అందరూ ఒక్కసారిగా సర్‌ఫ్రైజ్ అయ్యారు. చివరకు నమీబియా ఆటగాళ్ళు కూడా చప్పట్లతో శనకను అభినందించారు.

    మెుదట బ్యాటింగ్ చేసిన నమీబియా 19.3 ఓవర్లలో 96 పరుగులకే ఆలౌటైంది. క్రెయిగ్ విలియమ్స్ (29), కెప్టెన్ ఇరాసుమస్ (20) టాప్ స్కోరర్స్‌గా నిలిచారు. శ్రీలంక బౌలర్లలో తీశంక 3 వికెట్లు తీయగా, లహిరు కుమార, హసరంగ చెరో రెండు వికెట్లు తీశారు. కరుణరత్నే, చమీరకు ఒక్కొ వికెట్ దక్కింది. తీశంకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. శ్రీలంక కేవలం 13.3 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 100 పరుగులు చేసి విజయం సాధించింది.
    Published by:Rekulapally Saichand
    First published: