హిందువనే డానిష్ కనేరియాపై పాక్ క్రికెటర్ల వివక్ష.. షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..

డానిష్ కనేరియా హిందువు అన్న కారణంతో పాక్ క్రికెటర్లు వివక్ష చూపారని, అదే దేశానికి చెందిన క్రికెటర్.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు.

news18-telugu
Updated: December 27, 2019, 12:26 PM IST
హిందువనే డానిష్ కనేరియాపై పాక్ క్రికెటర్ల వివక్ష.. షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు..
డానిష్ కనేరియా, షోయబ్ అక్తర్
  • Share this:
డానిష్ కనేరియా.. పాక్ హిందూ క్రికెటర్. పాక్ జట్టులోకి ఒక హిందువు వచ్చాడంటే సంచలనమే. పాక్ జట్టులో అనిల్ దల్పాత్ తర్వాత చోటు దక్కించుకున్న రెండో హిందూ క్రికెటర్‌ డానిష్ కనేరియా. అలాంటిది జట్టులోకి రావడమే కాదు.. తన స్పిన్ బౌలింగ్‌తో అద్భుత ప్రదర్శనలు చేసిన సందర్భాలు కోకొల్లలు. టీమిండియాపై కూడా అతడు సూపర్‌గా బౌలింగ్ చేశాడు. అయితే.. ఆ తర్వాత కనుమరుగయ్యాడు. ఇప్పుడు షోయబ్ అక్తర్ చేసిన సంచలన వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి వచ్చాడు. డానిష్ కనేరియా హిందువు అన్న కారణంతో పాక్ క్రికెటర్లు వివక్ష చూపారని, అదే దేశానికి చెందిన క్రికెటర్.. రావల్పిండి ఎక్స్‌ప్రెస్ షోయబ్ అక్తర్ వ్యాఖ్యానించాడు. కనేరియాను సహచరులు కరాచీ, పంజాబ్ పేర్లు చెప్తూ ఘోరంగా అవమానించారని అక్తర్ చెప్పాడు.

పాక్‌లో ప్రసారం అవుతున్న గేమ్ ఆన్ హాయ్ కార్యక్రమానికి షోయబ్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా కనేరియాకు ఎదురైన అవమానాలను ప్రస్తావించాడు. కొందరు పాక్ క్రికెటర్లు ప్రాంతీయ వాదం గురించి మాట్లాడేవారని, కరాచీ నుంచి ఎవరు వచ్చారు? పంజాబ్, పెషావర్ నుంచి ఎవరైనా వచ్చారా? అంటూ అడిగేవారని గుర్తు చేశాడు. ‘కనేరియా హిందువే అయినా.. టీమ్ కోసం బాగా ఆడాడని, అతడి వల్లే ఇంగ్లండ్‌పై టెస్టుల్లో మేము గెలిచాం. ఒకవేళ అతడు టీమ్‌లో లేకపోయిఉంటే పాక్ ఆ సిరీస్‌ గెలిచేది కాదేమో.. అయితే, ఆ ఘనత కనేరియాకు దక్కనివ్వలేదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అక్తర్ వ్యాఖ్యలపై కనేరియా కూడా స్పందించాడు. తనకు జరిగిన అవమానాలు నిజమేనని స్పష్టం చేశాడు.

ఇదిలా ఉండగా, అక్తర్ వ్యాఖ్యలు భారత ప్రభుత్వానికి కాస్త మద్దతుగా నిలిచినట్లయ్యాయి. బీజేపీ కర్ణాటక తన ట్విట్టర్‌లో అక్తర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ.. విదేశీ మైనారిటీలకు అండగా నిలవడం తప్పా? అని ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.First published: December 27, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు