Cricket World Cup 2019: సచిన్ కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టేశాడు.. అభిమానులకు సర్‌ప్రైజ్..

ICC Cricket World Cup 2019: 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాస్టర్‌.. తొలిసారిగా ఇప్పుడే మైక్‌ అందుకున్నాడు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌తో సచిన్ వ్యాఖ్యాతగా అరంగేట్రం చేయడం విశేషం.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: May 31, 2019, 9:25 AM IST
Cricket World Cup 2019: సచిన్ కొత్త ఇన్నింగ్స్ మొదలెట్టేశాడు.. అభిమానులకు సర్‌ప్రైజ్..
సచిన్ టెండూల్కర్ (ఫైల్)
  • Share this:
సచిన్ టెండూల్కర్ బ్యాటు పట్టి మైదానంలోకి దిగితే దశాబ్దాల రికార్డులు బద్దలు అవుతాయి.. శతాబ్దాలైనా బద్దలు కాని కొత్త రికార్డులు వచ్చి చేరతాయి.. ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ కొత్త చరిత్ర సృష్టించిన ఈ దిగ్గజ ఆటగాడు మరో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టేశాడు. సునీల్ గవాస్కర్, కుంబ్లే, గంగూలీ, లక్ష్మణ్.. మాదిరిగా సచిన్‌ కూడా మైక్ పట్టేశాడు. వ్యాఖ్యాతగా మారిపోయాడు. 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మాస్టర్‌.. తొలిసారిగా ఇప్పుడే మైక్‌ అందుకున్నాడు. ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌తో సచిన్ వ్యాఖ్యాతగా అరంగేట్రం చేయడం విశేషం. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య టోర్నీ తొలి మ్యాచ్‌కు సచిన్‌ కామెంటరీ బాక్సులో దర్శనమిచ్చాడు. గంగూలీ, సెహ్వాగ్‌లతో కలిసి కామెంటరీ చెప్పాడు. మ్యాచ్‌‌కు ముందు స్టార్‌ స్పోర్ట్స్‌ చర్చా కార్యక్రమంలోనూ సచిన్‌ పాల్గొన్నాడు. ఆ కార్యక్రమానికి ‘సచిన్‌ ఓపెన్స్‌ అగేన్‌’ అని పేరు పెట్టిందా ఛానెల్‌.

ఆరు సార్లు వరల్డ్ కప్ టోర్నీల్లో ఆడిన సచిన్ టెండూల్కర్.. ఆ టోర్నీల్లో 2278 పరుగులు చేశాడు. టెండూల్కర్ తన 24 ఏళ్ల అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లు కలిపి 30వేలకు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ సచిన్ టెండూల్కరే కావడం విశేషం. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ చేసిన క్రికెటర్‌ కూడా అతడే.

Published by: Shravan Kumar Bommakanti
First published: May 31, 2019, 9:25 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading