రోహిత్ శర్మ టీ20ల్లో టాపర్. ఔను. 2288 పరుగులతో అంతర్జాతీయ క్రికెట్లో టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డులకి ఎక్కాడు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. ఆక్లాండ్‌లో మ్యాచ్‌కు ముందు టీ20ల్లో రోహిత్ శర్మది మూడో స్థానం. అతడి కంటే ఇద్దరు టాప్ స్కోర్ చేసిన బ్యాట్స్‌మెన్ ఉన్నారు.
రోహిత్ శర్మ (Image:BCCI/Twitter)
న్యూజిలాండ్ క్రికెటర్ గుప్తిల్ (2272 పరుగులు) , పాకిస్థాన్ ఆటగాడు షోయబ్ మాలిక్ (2263) ఇద్దరూ టాపర్లుగా ఉండగా, రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. అయితే, రెండో టీ20లో 50 పరుగులు చేసిన రోహిత్ శర్మ.. ఏకంగా ఫస్ట్ ప్లేస్‌కు చేరుకున్నాడు. దీంతో ఇప్పటి వరకు టీ20ల్లో అతడు చేసిన రన్స్ 2288కి చేరాయి. టీ 20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్ లిస్టులో విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో ఉండడం గమనార్హం.
రోహిత్ శర్మ (Getty Images)
ప్రస్తుతం టాప్‌లో ఉన్న నలుగురు బ్యాట్స్‌మెన్ ఇంకా రిటైర్ కాలేదు. మరికొన్నాళ్లు కచ్చితంగా క్రీజులో ఉంటారు. కాబట్టి, రోహిత్ శర్మ రికార్డును మరొకరు తిరగరాయడం ఖాయం. అందుకు ఎక్కువ సమయం కూడా పట్టకపోవచ్చు.
రోహిత్ శర్మ
న్యూజిలాండ్, ఇండియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో మార్టిన్ గుప్తిల్ గాయం కారణంగా ఆడడం లేదు. విరాట్ కోహ్లీకి బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. షోయబ్ మాలిక్ ఇటీవలే దక్షిణ ఆఫ్రికాతో టీ20 సిరీస్ ముగించాడు.
ఆటగాడి పేరు
పరుగులు
ఎన్ని ఇన్నింగ్స్
రోహిత్ శర్మ
2288
84
మార్టిన్ గుప్తిల్
2272
74
షోయబ్ మాలిక్
2263
104
విరాట్ కోహ్లీ
2167
60
మరోవైపు రెండేళ్లలో 202 సిక్స్‌లు కొట్టిన క్రికెటర్ కూడా రోహిత్ శర్మే. 2016 జనవరి 1 తర్వాత ఇప్పటి వరకు డబుల్ సెంచరీ సిక్సులు కొట్టింది హిట్ మ్యాన్ ఒక్కడే. రోహిత్ శర్మ తర్వాత లిస్టులో మార్టిన్ గుప్తిల్ (110), కాలిన్ మన్రో (104) ఉన్నారు. అలాగే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సులు కొట్టిన వారిలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. షాహిద్ అఫ్రిది, క్రిస్ గేల్ (476), మెక్కల్లమ్ (398), సనత్ జయసూర్య (352) తర్వాత రోహిత్ శర్మ (349) ఉన్నాడు. రోహిత్ శర్మ తర్వాత ఎంస్ ఎస్ ధోనీ (348) క్యూలో ఉన్నాడు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.