Rohit Sharma: రోహిత్ శర్మ విజయానికి అసలు కారణం ఏంటో తెలిస్తే షాకే...

రోహిత్ శర్మ ఇతర ఆటగాళ్ళలాగే మూఢనమ్మకాలను నమ్ముతాడు. హిట్ మ్యాన్ యొక్క మూఢనమ్మకాలు ఏంటో చూద్దాం.

news18-telugu
Updated: May 24, 2020, 7:34 AM IST
Rohit Sharma: రోహిత్ శర్మ విజయానికి అసలు కారణం ఏంటో తెలిస్తే షాకే...
రోహిత్ శర్మ (File)
  • Share this:
వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు, టి 20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధికంగా 4 సెంచరీలు, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించే అలవాటు. ఏ బౌలర్‌ను అయినా వీరవిహారం చేసే బ్యాట్స్ మాన్. టీమ్ ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ అనే చెప్పాలి. ఇతడిని హిట్ మాన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. రోహిత్ శర్మ బ్యాట్ కదిలితే ప్రపంచం స్తంభించిపోతుంది. ఎంత వేగంగా బౌలర్ చేసినా రోహిత్ శర్మకు సంబంధంలేదు. బంతిని బాదడమే పని. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రోహిత్ శర్మను ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్‌గా పరిగణించడానికి ఇదీ ఒక కారణం. రోహిత్ శర్మ ఇప్పటికే అనేక రికార్డులు నెలకొల్పాడు. అటు ఐపిఎల్ లో కూడా అతడు చాలా విజయవంతమయ్యాడు. కానీ రోహిత్ శర్మ ఇతర ఆటగాళ్ళలాగే మూఢనమ్మకాలను నమ్ముతాడు. హిట్ మ్యాన్ మూఢనమ్మకాలు ఏంటో చూద్దాం.

- రోహిత్ శర్మ మ్యాచ్‌కు ముందు ఖచ్చితంగా కాఫీ తాగుతాడు. ఇది తనకు మానసిక బలాన్ని ఇస్తుందని నమ్ముతాడు.

- రోహిత్ శర్మ యొక్క రెండో నమ్మకం ఏంటంటే..అతను ఖచ్చితంగా తన భార్య రితికాను బ్యాటింగ్‌కు వెళ్ళే ముందు పిలుస్తాడు. జట్టు సమావేశానికి ముందు రితికను పిలవడం అతడికి అలవాటు.
- రోహిత్ శర్మ యొక్క మూడవ నమ్మకం ఏమిటంటే, అతను ఎప్పుడూ తన కుడి పాదంతో మైదానంలోకి అడుగు పెడతాడు.
- రోహిత్ శర్మ నాల్గవ నమ్మకం రోహిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో, అతని భార్య రితికా తన రెండు చేతుల వేళ్లను కట్టి (క్రాస్) ఉంచుతుంది. రోహిత్ శర్మ ఒక సెంచరీ పూర్తి చేసినప్పుడు, రితికా వేళ్లు తెరుస్తుంది.

రోహిత్ శర్మ తన భార్య రితికను చాలా అదృష్టంగా భావిస్తాడు. రోహిత్, రితికా 13 డిసెంబర్ 2015 న వివాహం చేసుకున్నారు. రితికా రోహిత్ జీవితంలోకి అడుగుపెట్టినప్పటి నుండి, ఆమె అతడికి జాక్ పాట్ గా మారింది. వివాహం అయినప్పటి నుండి, రోహిత్ శర్మ 80 వన్డేలలో 64.97 సగటుతో 4548 పరుగులు చేశాడు, ఇందులో 21 సెంచరీలు మరియు 16 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ వివాహం తర్వాత టీ 20 లో 3 సెంచరీలు సాధించాడు. ఇది మాత్రమే కాదు, వివాహం తర్వాత రోహిత్ శర్మ కూడా టెస్ట్ ఫార్మాట్‌లో గొప్ప ప్రదర్శన కనబరిచాడు. రోహిత్ శర్మ 24 ఇన్నింగ్స్‌లలో 65.42 సగటుతో 1245 పరుగులు చేశాడు, ఇందులో 4 సెంచరీలు మరియు 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసినప్పుడల్లా తన ఉంగరపు వేలికి ముద్దు పెట్టడానికి కారణం ఇదే కావచ్చు.
First published: May 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading