హోమ్ /వార్తలు /క్రీడలు /

Reliance Jio: జియో యూజర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఫ్రీ... క్రికెట్ మ్యాచ్‌లు చూడండి ఇలా

Reliance Jio: జియో యూజర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఫ్రీ... క్రికెట్ మ్యాచ్‌లు చూడండి ఇలా

Reliance Jio: జియో యూజర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఫ్రీ... క్రికెట్ మ్యాచ్‌లు చూడండి ఇలా
(image: Jio)

Reliance Jio: జియో యూజర్లకు హాట్‌స్టార్ యాక్సెస్ ఫ్రీ... క్రికెట్ మ్యాచ్‌లు చూడండి ఇలా (image: Jio)

Reliance Jio | జియో యూజర్లందరికీ హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. జియో టీవీ యాప్ ఓపెన్ చేయగానే హాట్‌స్టార్‌కు రీడైరెక్ట్ అవుతుంది. డేటా ఛార్జీలు వర్తిస్తాయి.

  రిలయెన్స్ జియో యూజర్లకు శుభవార్త. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచ్‌లు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తోంది రిలయెన్స్ జియో. వరల్డ్ కప్‌లో జరిగే అన్ని మ్యాచ్‌లను జియో యూజర్లు ఫ్రీగా చూడొచ్చు. ఇందుకోసం క్రికెట్ సీజన్ డేటా ప్యాక్ రూ.251 రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రీఛార్జ్‌తో జియో యూజర్లకు రూ.365 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. క్రికెట్ మ్యాచ్‌లను ఉచితంగా చూడొచ్చు. లేకపోతే వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసేందుకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇండియాలో ఏ టెలికామ్ ఆపరేటర్ ఇలాంటి ఆఫర్ అందివ్వట్లేదు. జియో టీవీ యాప్ ద్వారా హాట్‌స్టార్‌లో లైవ్ క్రికెట్ చూడొచ్చు. జియో యూజర్లందరికీ హాట్‌స్టార్ యాక్సెస్ ఉచితంగా లభిస్తుంది. జియో టీవీ యాప్ ఓపెన్ చేయగానే హాట్‌స్టార్‌కు రీడైరెక్ట్ అవుతుంది. డేటా ఛార్జీలు వర్తిస్తాయి.


  Read this: Cricket Score: క్రికెట్ స్కోర్ ఎంత? ఈ యాప్స్‌లో చూడండి


  రూ.251 జియో క్రికెట్ సీజన్ స్పెషల్ డేటా ప్యాక్ రీఛార్జ్ చేసుకున్న వారికి 51 రోజుల పాటు రోజుకు 2 జీబీ చొప్పున 102 జీబీ హైస్పీడ్ డేటా లభిస్తుంది. మొత్తం వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూసేందుకు ఈ డేటా సరిపోతుంది. జియో టీవీలో క్రికెట్ మ్యాచ్‌లు ఉచితంగా చూడటంతో పాటు 'జియో క్రికెట్ ప్లే ఎలాంగ్‌' కాంటెస్ట్‌లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. స్కోర్స్, మ్యాచ్ షెడ్యూల్స్, రిజల్ట్స్ తెలుసుకోవడంతో పాటు కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. ఈ గేమ్ జియో, నాన్ జియో సబ్‌స్క్రైబర్లకు అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం మైజియో యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ బాల్, ప్రతీ ఓవర్, ప్రతీ మ్యాచ్‌కు ఏం జరుగుతుందో కాంటెస్ట్‌లో ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ద్వారా పాయింట్లు గెలుచుకోవచ్చు. ఎక్కువ పాయింట్స్ గెలిచినవారికి బహుమతులు ఉంటాయి.


  Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో  ఇవి కూడా చదవండి:


  Aadhaar Franchise: ఆధార్ కార్డ్ ఫ్రాంఛైజ్‌కు దరఖాస్తు చేసుకోండి ఇలా


  Air India Jobs: ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు... టెన్త్‌తో పాటు అనుభవం తప్పనిసరి


  Dish Tv Contest: క్రికెట్ కాంటెస్ట్‌లో గెలిస్తే ఒక నెల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్

  First published:

  Tags: Cricket, ICC Cricket World Cup 2019, Jio, Reliance Jio

  ఉత్తమ కథలు