గంభీర్‌పై నోరు పారేసుకున్న అఫ్రిదీ.. వ్యక్తిత్వం లేదంటూ.. మ్యాచ్‌లో గొడవ..

తాను పాజిటివ్‌గా ఆలోచించే వాళ్లను ఇష్టపడతానని, కానీ, అతడు అలా ఉండడని తెలిపాడు. ఈ సందర్భంగా 2007లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు.

news18-telugu
Updated: May 3, 2019, 2:11 PM IST
గంభీర్‌పై నోరు పారేసుకున్న అఫ్రిదీ..  వ్యక్తిత్వం లేదంటూ.. మ్యాచ్‌లో గొడవ..
గౌతమ్ గంభీర్ (ఫైల్)
  • Share this:
భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే ఒక రకమైన ఉత్కంఠ. మాటలు, చేతలు దూకుడుగా ఉంటాయి. ప్రత్యర్థిని అవుట్ చేస్తే వచ్చే హావభావాలు, సిక్స్ కొట్టినపుడు చేసే వింత చర్యలు రక్తి కట్టిస్తాయి. అది చలికాలం అయినా వాతావరణం హీటెక్కుతుంది. ఇక, 2007లో భారత వెటరన్ గౌతం గంభీర్, పాకిస్థాన్ క్రికెటర్ అఫ్రిదీ మధ్య చోటుచేసుకున్న సంఘటన కాస్త ఉద్రిక్తతను పెంచిన విషయం తెలిసిందే. ప్రత్యర్థితో ఢీ అంటే ఢీ అనడానికి గంభీర్ ఎప్పుడూ వెనుకాడడు. ఇప్పుడు రాజకీయాల్లో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ వార్తలో నిలుస్తున్నాడు. అయితే, తాజాగా అఫ్రిదీ తన ఆత్మకథ పుస్తకం ‘గేమ్ ఛేంజర్’లో గంభీర్‌పై నిప్పులు చెరిగాడు. భారత మాజీ ఓపెనర్‌పై తన కసినంతా తీర్చుకున్నాడు.ఆ బుక్‌లో గంభీర్‌పై స్పందిస్తూ.. ‘కొన్ని శత్రుత్వాలు వ్యక్తిగతంగా ఉంటాయి.. మరికొన్ని ప్రొఫెషనల్‌గా ఉంటాయి. గంభీర్ విషయానికి వచ్చే సరికి శత్రుత్వం అనేది వ్యక్తిగతమే. అతడి వైఖరే ప్రధాన సమస్య. గంభీర్‌కు అసలు వ్యక్తిత్వమే లేదు. క్రికెట్‌లో అతడికి గొప్ప రికార్డులేవీ లేవు. ఒక విధమైన వైఖరి తప్ప’ అని పేర్కొన్నాడు. అంతేకాదు..గంభీర్ వైఖరి పోటీ పడేలా ఉండదని, ఎప్పుడూ నెగెటివ్‌గానే ఆలోచిస్తాడని వ్యాఖ్యానించాడు. తాను పాజిటివ్‌గా ఆలోచించే వాళ్లను ఇష్టపడతానని, కానీ, అలా ఉండడని తెలిపాడు. ఈ సందర్భంగా 2007లో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనను గుర్తు చేసుకున్నాడు. ఇదిలా ఉండగా, తాను 1996లో శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్‌లో 37 బంతుల్లోనే సెంచరీ సాధించినపుడు తన వయసు 19 ఏళ్లని, కానీ, 16 ఏళ్లుగా అధికారులు తప్పుగా ప్రకటించారని సంచలన ప్రకటన చేశాడు.

కాగా, గంభీర్‌ ఎప్పుడూ అభద్రతా భావంతో ఉండేవాడని, 150 పరుగులు చేసినా సంతోషంగా ఉండేవాడు కాదని టీమిండియా మాజీ మానసిక కోచ్‌ ప్యాడీ అప్టన్‌ పేర్కొన్నాడు. ఇటీవలే ఆయన రాసిన ది బేర్‌ఫుట్ కోచ్ అనే పుస్తకంలో2009లో గంభీర్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యేంతవరకూ కష్టపడ్డానని, ఇంకొంచెం శ్రమించి ఉంటే ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్‌ అయ్యేవాడని అన్నాడు. గంభీర్ సెంచరీ సాధించినా, తృప్తి ఉండేది కాదని.. ఎప్పుడు తాను చేసిన తప్పులను గుర్తు చేసుకొని ఆవేదన చెందేవాడని ప్యాడీ తెలిపాడు. ఇక, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంటే తనకు ఎనలేని గౌరవమని ప్యాడీ తన పుస్తకంలో పేర్కొన్నాడు. అతనికి తన భావాలపై నియంత్రణ ఉంటుందని, వెంటనే భావోద్వేగానికి గురికాడని అన్నాడు.
First published: May 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>