Virat Kohli: కోహ్లీకి అవమానం...ఆ జట్టులో దక్కని స్థానం...కారణం అదేనా...

విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా కోచ్ బ్రాడ్ హాగ్ వరల్డ్ టెస్ట్ ఎలెవన్‌ డ్రీం టీమ్‌లో చోటు దక్కలేదు. తన డ్రీమ్ టీంలో హాగ్‌ నలుగురు టీమిండియా ఆటగాళ్ళను ఎంచుకున్నాడు.

news18-telugu
Updated: May 24, 2020, 7:14 AM IST
Virat Kohli: కోహ్లీకి అవమానం...ఆ జట్టులో దక్కని స్థానం...కారణం అదేనా...
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli Biopic)
  • Share this:
భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్ లోని ప్రతి ఫార్మాట్‌లో ప్రపంచంలోని టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ఉన్నాడు. శతకాలు మోగించడంలో కొత్త రికార్డు వైపు దూసుకెళ్తున్న ఈ ఆటగాడిని. ప్రపంచంలోని ఏ డ్రీమ్ టీమ్ లో అయినా చోటు దక్కాల్సిందే. అయితే కాని విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా కోచ్ బ్రాడ్ హాగ్ వరల్డ్ టెస్ట్ ఎలెవన్‌ డ్రీం టీమ్‌లో చోటు దక్కలేదు. తన డ్రీమ్ టీంలో హాగ్‌ నలుగురు టీమిండియా ఆటగాళ్ళు ఉన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టెస్ట్ సిరీస్ కోహ్లీ కెరీర్‌లోనే చెత్త టెస్ట్ సిరీస్‌గా చెబుతుంటారు. అందుకే కోహ్లీని హాగ్ తన డ్రీం టెస్ట్ జట్టుకు దూరంగా పెట్టినట్లు సమాచారం. కోహ్లీ జట్టులో ఎందుకు లేడని అందరూ నన్ను అడుగుతున్నారని, కానీ అతని చివరి 15 టెస్ట్ ఇన్నింగ్స్ చూస్తే, నాలుగు సార్లు మాత్రమే అతను 31 పరుగులకు పైగా సాధించాడాని హాగ్ తెలిపాడు. ఈ కారణంగా, కోహ్లీ ఈ సంవత్సరం తన డ్రీం టెస్ట్ జట్టులో లేడని తెలిపాడు.

హాగ్ తన జట్టులో మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలను ఓపెనర్‌గా ఎంచుకున్నాడు. ఫ్రంట్ ఫుట్ మీద మయాంక్ కవర్ డ్రైవ్, పుల్ షాట్ తనకు చాలా ఇష్టమని హాగ్ చెప్పారు. అదే సమయంలో, రోహిత్ శర్మ కూడా హాగ్ జట్టులో చోటు సంపాదించాడు. అతని సగటు 90 కంటే ఎక్కువ, కానీ అతను భారతదేశంలో మాత్రమే టెస్ట్ క్రికెట్ ఆడాడు.

ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తరఫున 7 టెస్టులు, 123 వన్డేలు, 15 టి 20 లు ఆడిన హాగ్స్, మార్నస్ లబుషెన్ ను మూడో స్థానంలో, స్టీవ్ స్మిత్ ను నాలుగవ స్థానంలో ఎంచుకున్నాడు. అయితే బాబర్ ఆజం ఐదవ స్థానంలో ఉన్నాడు. ఆరవ స్థానంలో అజింక్య రహానె, ఆ పై వికెట్ కీపర్ బ్యాట్స్ మాన్ క్వింటన్ డి కాక్ తన జట్టులో పేర్కొన్నాడు. ఇక బౌలింగ్‌లో పాట్ కమ్మిన్స్, మహ్మద్ షమీ, నీల్ వాంగ్నర్ ఎంపికచేశాడు.
First published: May 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading