హోమ్ /వార్తలు /క్రీడలు /

Mohammed Shami Wife Hasin Jahan: " పెళ్లై ఓ బిడ్డకు తల్లివి.. ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా ".. షమీ భార్య బోల్డ్ ఫోటోపై దారుణమైన ట్రోలింగ్..

Mohammed Shami Wife Hasin Jahan: " పెళ్లై ఓ బిడ్డకు తల్లివి.. ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా ".. షమీ భార్య బోల్డ్ ఫోటోపై దారుణమైన ట్రోలింగ్..

మహ్మద్ షమీ - భార్య హాసీన్ జహాన్ (Instagram)

మహ్మద్ షమీ - భార్య హాసీన్ జహాన్ (Instagram)

Mohammed Shami Wife Hasin Jahan: క్రికెట్ కెరీర్ లో ఇలా తిరుగులేని క్రేజ్ తో దూసుకెళ్తున్న మహ్మద్‌ షమీకి పర్సనల్ లైఫ్ మాత్రం దారుణ ఫెయిల్యూర్ అని చెప్పాలి. ఇక తాజాగా షమీ భార్య హసీన్‌ జహాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్‌ ఫోటో షేర్‌ చేశారు.

ఇంకా చదవండి ...

  టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ(Mohammed Shami) ఇంగ్లండ్ గడ్డపై అద్భుతంగా రాణిస్తున్నాడు. లేటెస్ట్ గా ఇంగ్లాండ్ పర్యటనలో బ్యాటింగ్, బౌలింగ్ తో అదరగొట్టి టీమిండియాకు చిరస్మనీయమైన విజయాన్ని అందించాడు. క్రికెట్ కెరీర్ లో ఇలా తిరుగులేని క్రేజ్ తో దూసుకెళ్తున్న మహ్మద్‌ షమీకి పర్సనల్ లైఫ్ మాత్రం దారుణ ఫెయిల్యూర్ అని చెప్పాలి. 2014, ఏప్రిల్‌ 7 న భార్య హసీన్‌ జహాన్‌ (Hasin Jahan) ని వివాహం చేసుకున్నాడు మహ్మద్‌ షమీ. కానీ చాలా కాలం నుంచి వీరిద్దరూ విడిగా ఉంటున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయినప్పటికీ ఇంకా వీరు విడాకులు తీసుకోలేదు.షమీపై 2018లో హాసిన్ వేధింపుల కేసు కూడా పెట్టింది. వీలు దొరికినప్పుడల్లా షమీపై విమర్శలు గుప్పిస్తూనే ఉంది. వీరికి ఓ కూతురు కూడా ఉంది. ఇక, హసీన్ జహాన్ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. ఇక తాజాగా హసీన్‌ జహాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ బోల్డ్‌ ఫోటో షేర్‌ చేశారు. ఇది చూసిన వారు కొందరు అందంగా ఉన్నావని పొగడగా.. చాలామంది మాత్రం దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు.

  ఇన్‌స్టాగ్రామ్‌లో హసీన్‌ జహాన్‌కు లక్షమందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. లేటెస్ట్ గా హసీన్‌ ఇన్‌స్టాలో ఓ బోల్డ్‌ ఫోటో షేర్‌ చేశారు. దీనిలో హసీన్‌ తెలుపు రంగు రగ్గడ్‌ జీన్స్‌, బ్లాక్‌ టాప్‌ ధరించి ఉన్నారు. ఈ క్లోజప్‌ ఫోటోలో హసీన్‌ కాస్త బోల్డ్‌గా దర్శనిమిచ్చారు. ఇది కాస్త సోషల్‌ మీడియాలో తెగ వైరలయ్యింది. ఇక ఈ ఫోటో చూసిన కొందరు హసీన్‌ చాలా అందంగా ఉన్నారు అని ప్రశంసించగా.. చాలా మంది మాత్రం దారుణంగా ట్రోల్‌ చేస్తున్నారు. పెళ్లై ఓ బిడ్డకు తల్లివి అయ్యావ్‌.. అయినా కూడా ఇంత ఎక్స్‌పోజింగ్‌ అవసరమా అంటూ మండిపడుతున్నారు.


  ఇక షమీ-హసీన్‌ చాలా కాలం నుంచి విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. వ్యక్తిగత కారణాల వల్ల విడివిడిగా జీవిస్తున్నప్పటికి.. ఇంకా వీరు విడాకులు తీసుకోలేదు. అయితే షమీపై భార్య కొద్దిరోజుల క్రితం సంచలన ఆరోపణలు చేసింది. షమీకి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఉందంటూ సంచలన ఆరోపణలు చేసి అప్పట్లో వార్తల్లోకి ఎక్కింది. అయితే సాక్షాలు చూపెట్టకపోవటంతో ఆ ఇష్యు అక్కడితో సద్దుమణిగింది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, Mohammed Shami, Sports

  ఉత్తమ కథలు