AUSVSENG: ఇది తొండాట.. స్మీత్ చిటింగ్ చేశాడు

ఇంగ్లాండ్,ఆసీస్ మధ్య జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో నాటకీయ పరిణామం జరిగింది. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసీస్ జట్టు చీటింగ్ చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.


Updated: September 10, 2020, 7:11 PM IST
AUSVSENG: ఇది తొండాట.. స్మీత్ చిటింగ్ చేశాడు
england-vs-australia
  • Share this:


ఇంగ్లాండ్,ఆసీస్ మధ్య జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో నాటకీయ పరిణామం జరిగింది. ఈ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆసీస్ జట్టు చీటింగ్ చేసిందంటూ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్.  ఈ మ్యాచ్‌లో మొయిన్‌ అలీ ఔటైనా తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 16 వ ఓవర్లలో ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఐదవ బంతిని డీప్ మిడ్ వికెట్‌మీదుగా భారీ షాట్ ఆడాడు. దీన్ని బౌండరీ లైన్ వద్ద స్మిత్ డైవ్ చేస్తూ  క్యాచ్ పట్టాడు. ఈ క్రమంలో అతను బౌండరీ లైన్ లోపలికి దూసుకేళుతున్న విషయాన్ని గ్రహించి బంతిని గాల్లోకి ఎగిరేసి  మళ్ళీ క్యాచ్ పట్టాడు. దీంతో అలీని ఫీల్డ్ అంపైర్ ఔటిచ్చాడు. ప్రస్తుతం ఈ విషయం వివాదాస్పదంగా మారింది.




క్యాచ్ పట్టిన విధానం స్పష్టంగా కనిపించకపోవడంతో థర్ట్ అంపైర్ వీడియోను రీప్లైలో చూశారు. పలుమార్లు ఆ వీడియో పరిశీలించి క్యాచ్ సరిగానే పట్టినట్లు గుర్తించిన థర్ట్ అంపైర్, ఆన్ ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని స్వాగతించారు. అయితే బంతిని పట్టుకునే క్రమంలో స్మిత్ పాదం బౌండరీ లైన్‌కు తాకినట్లు వీడియోను క్లోజ్‌గా పరిశీలిస్తే తెలుస్తోంది. బౌండరీ లైన్ తాకింది షూ నీడని అనుకున్న థర్డ్ ఎంపైర్ దాన్ని నాటౌట్‌గా ప్రకటించాడు.



ప్రస్తుతం ఈ ఘటనపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు. అంపైర్ల అలా ఎలా ప్రకటిస్తారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.  సిక్స్ వెళ్ళిన బాల్‌ను ఎలా ఔట్ అంటారని విమర్శిస్తున్నారు. అలాగే స్మిత్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లకు చీటింగ్ చేయడం కొత్తేం కాదంటూ మండిపడుతున్నారు.
Published by: Rekulapally Saichand
First published: September 10, 2020, 6:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading