CRICKET NEWS BANGLADESH FORMER CRICKETERS SAMIUR RAHMAN MUSHARRAF HOSSAIN PASS AWAY DUE BRAIN TUMOUR SJN
Cricket News : బంగ్లాదేశ్ క్రికెట్ లో తీవ్ర విషాదం.. ఒకే రోజు మరణించిన ఇద్దరు బంగ్లా క్రికెటర్లు.. కారణం ఒక్కటే..
సమియుర్, ముషారఫ్ (PC : TWITTER)
Cricket News : బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ లో నేడు (మంగళవారం, ఏప్రిల్ 19) చీకటి రోజుగా మిగలనుంది. ఎందుకంటే మంగళవారం నాడు ఆ దేశానికి చెందిన ఇద్దరు మాజీ క్రికెటర్లు మృతి చెందారు. బంగ్లాదేశ్ తొలి అంతర్జాతీయ వన్డే జట్టులో సభ్యుడైన సమియుర్ రహ్మాన్ (69), మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ముషారఫ్ హొసైన్ రుబెల్ (40) ఏప్రిల్ 19వ తేదీన కన్నుమూశారు.
Cricket News : బంగ్లాదేశ్ (Bangladesh) క్రికెట్ లో నేడు (మంగళవారం, ఏప్రిల్ 19) చీకటి రోజుగా మిగలనుంది. ఎందుకంటే మంగళవారం నాడు ఆ దేశానికి చెందిన ఇద్దరు మాజీ క్రికెటర్లు మృతి చెందారు. బంగ్లాదేశ్ తొలి అంతర్జాతీయ వన్డే జట్టులో సభ్యుడైన సమియుర్ రహ్మాన్ (69), మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ ముషారఫ్ హొసైన్ రుబెల్ (40) ఏప్రిల్ 19వ తేదీన కన్నుమూశారు. ఇద్దరు కూడా ప్రాణాంతక బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో మృతి చెందడం గమనార్హం. ఒకే రోజు ఇద్దరు మాజీ క్రికెటర్లు కన్నుమూయడం పట్ల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (bangladesh Cricket Board) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. గత కొంత కాలంగా ఢాకాలోని సిటీ ఆసుపత్రిలో సమియుర్ బ్రెయిన్ ట్యూమర్ కు చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆతడు కోలుకోలేక మృతి చెందగా.. అదే వ్యాధికి చికిత్స పొందుతూ ముషారఫ్ కూడా అశువులు బాసాడు.
రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన సమియుర్ బంగ్లాదేశ్ తరఫున రెండు అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. అయితే ఇందులో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ముషారఫ్ 2008-16 మధ్యలో 5 వన్డేల్లో బంగ్లాదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు. నాలుగు వికెట్లు తీశాడు. సమియుర్ ఆటగాడిగా రిటైర్ అయిన అనంతరం బంగ్లా దేశవాళీ టోర్నీలకు అంపైర్‌గా వ్యవహరించాడు. బంగ్లాదేశ్ దేశవాళీ టోర్నీల్లో ముషారప్ 572 వికెట్లు పడగొట్టడం విశేషం.
సమియుర్ రహ్మాన్ కు భార్య ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడి సోదరుడు యూసఫ్ రహ్మాన్ కూడా క్రికెటర్ కావడం విశేషం. ప్రస్తుతం అతడు అమెరికాలో స్థిరపడ్డాడు. సమియుర్ రహ్మాన్ కు క్రికెట్ తో పాటు బాస్కెట్ బాల్ లో కూడా ప్రావీణ్యం ఉంది. రిటైర్మెంట్ తర్వాత సమియుర్ అంపైర్ గా సేవలు అందించాడు. వీరిద్దరి మరణానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుతో పాటు ఆటగాళ్లు కూడా నివాళులు అర్పించారు. బంగ్లాదేశ్ వ్యాప్తంగా జరిగిన పలు క్రికెట్ మ్యాచ్ లకు ముందు వీరు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Published by:N SUJAN KUMAR REDDY
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.