IPL Final: అంపైర్ నిర్ణయాన్ని అవహేళన చేశాడు.. దెబ్బకు ఆ క్రికెటర్‌కు..

ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున కీరన్ పోలార్డ్ కేవలం 25 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. అయితే, ఆట మధ్యలో అతడు ప్రవర్తించిన తీరుకు గానూ మ్యాచ్ ఫీజులో కోతపడింది.

news18-telugu
Updated: May 13, 2019, 2:22 PM IST
IPL Final: అంపైర్ నిర్ణయాన్ని అవహేళన చేశాడు.. దెబ్బకు ఆ క్రికెటర్‌కు..
పొలార్డ్‌తో చర్చిస్తున్న అంపైర్లు (Image:IPL)
news18-telugu
Updated: May 13, 2019, 2:22 PM IST
ఐపీఎల్ చరిత్రలో నాలుగో సారి టైటిల్ సాధించిన జట్టుగా ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించింది. ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్‌కింగ్స్ జట్టును కేవలం ఒక పరుగు తేడాతో ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెనర్ వాట్సన్ 80 పరుగులు చేసినా తన టీంను గెలిపించుకోలేకపోయాడు. అయితే, ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున కీరన్ పోలార్డ్ కేవలం 25 బంతుల్లోనే 41 పరుగులు చేశాడు. అయితే, ఆట మధ్యలో అతడు ప్రవర్తించిన తీరుకు గానూ మ్యాచ్ ఫీజులో కోతపడింది. ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన కింద అతనికి ఈ జరిమానా విధించినట్లు ఐపీఎల్‌ యాజమాన్యం తెలిపింది. 19 ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన డ్వేన్‌ బ్రావో రెండో బంతిని వైడ్‌కు దగ్గరగా వేశాడు. ఆ బంతిని అంపైర్‌ నితిన్‌ మేనన్‌ వైడ్‌గా ప్రకటిస్తాడని పొలార్డ్‌ భావించాడు. కానీ, వైడ్‌ ఇవ్వలేదు.

అలా అంపైర్ వరుసగా రెండు వైడ్ బంతుల్ని లీగల్ డెలివరీలుగా ప్రకటించాడు. దీంతో అసహనానికి గురైన పొలార్డ్‌ బ్యాట్‌ను గాల్లోకి విసిరేశాడు. ఆ తర్వాత బంతి వేసేందుకు బ్రావో పరుగెత్తున్న సమయంలో క్రీజులో ఉన్న పొలార్డ్‌.. అంపైర్‌ నిర్ణయాన్ని అవహేలన చేసేలా.. వైడ్‌ను దాటి నడుస్తూ వెళ్లిపోయాడు. దీంతో ఐపీఎల్‌ నియమావళి ఉల్లంఘన కింద పొలార్డ్‌కు మ్యాచ్‌ ఫీజులో 25శాతం కోత పడింది.



First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...