MS Dhoni : కశ్మీర్‌లో మిస్టర్ కూల్ డ్యూటీ.. అక్కడ ఏం చేయనున్నాడంటే..

MS Dhoni: గురువారం ఆయన 106 టెరిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 15 వరకు ధోని ఆ బెటాలియన్‌తో కలిసి కశ్మీర్ లోయలో పనిచేయనున్నట్లు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 25, 2019, 2:54 PM IST
MS Dhoni : కశ్మీర్‌లో మిస్టర్ కూల్ డ్యూటీ.. అక్కడ ఏం చేయనున్నాడంటే..
ధోనీ ( ఫైల్ చిత్రం)
  • Share this:
వెస్టిండీస్ పర్యటనకు దూరంగా ఉంటానని, రెండు నెలల పాటు భారత సైన్యంలో పనిచేయాలనుకుంటున్నట్లు ప్రకటించిన టీమిండియా మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని.. లెఫ్టినెంట్ హోదాలో పారాచూట్ రెజిమెంట్‌లో శిక్షణ తీసుకునేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఆయన 106 టెర్రిటోరియల్ ఆర్మీ బెటాలియన్‌లో చేరారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 15 వరకు ధోని ఆ బెటాలియన్‌తో కలిసి కశ్మీర్ లోయలో పనిచేయనున్నట్లు ఆర్మీ ఒక ప్రకటనలో తెలిపింది. విక్టర్ ఫోర్స్ పేరిట నిర్వహించే యూనిట్‌లో పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ పనులను ధోని నిర్వహించనున్నారు. 15 రోజుల పాటు ఆయన బెటాలియన్‌తో పాటే ఉంటారు.

2011లో భారత ఆర్మీ ధోనికి గౌరవ సూచకంగా లెఫ్టినెంట్ కర్నల్ హోదాను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ 38 ఏళ్ల క్రికెటర్ 2015లో ప్యారా ట్రూపర్‌గానూ క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు సైనికులతో కలిసి పెట్రోలింగ్, గార్డ్, పోస్ట్ డ్యూటీ సేవలు అందించనున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: July 25, 2019, 2:54 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading