MS Dhoni: ధోనికి అరుదైన గౌరవం.. లడఖ్‌లో జెండా ఆవిష్కరణ..

MS Dhoni: సైనిక బాధ్యతల్లో ఉన్న ధోని అరుదైన గౌరవం అందుకోబోతున్నాడు. జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డ లడఖ్‌లో జాతీయ జెండా ఎగుర వేయనున్నాడు. ఆగస్టు 15న లడఖ్‌లోని లేహ్ పట్టణంలో మువ్వన్నెల జెండా ఎగువవేయనున్నట్లు సమాచారం.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 9, 2019, 1:11 PM IST
MS Dhoni: ధోనికి అరుదైన గౌరవం.. లడఖ్‌లో జెండా ఆవిష్కరణ..
ఎంఎస్ ధోనీ (ఫైల్ చిత్రం)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 9, 2019, 1:11 PM IST
మహేంద్ర సింగ్ ధోని.. ఈ పేరెత్తితే అభిమానులు ఊగిపోతారు. తమనెప్పుడూ తలెత్తుకునేలా చేస్తాడని గర్వంగా ఫీలవుతారు.. భద్రత కంచెలను తెంచి మైదానంలోకి పరుగెత్తి అతడి పాదాలను స్పృషించేందుకు తహతహలాడేంత అభిమానం వాళ్లది.. అందుకు తగ్గట్లే వారిని ఆటపట్టిస్తూ జీవితంలో గుర్తుండిపోయే తీపి గుర్తులను వారికి అందిస్తాడు ధోని. ఎవరి అంచనాలకు అందడు.. తాను చేసే పనిని సైలెంట్‌గా చేస్తూ ఒక్కసారిగా ఆశ్చర్యపరుస్తాడు.. వరల్డ్ కప్‌ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని అంతా భావించారు. కానీ, ధోని ఆలోచనే వేరాయే. క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చి దేశ సేవలో మునిగిపోయాడు. భారత ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదా పొందిన మిస్టల్ కూల్.. దేశ సరిహద్దుకు వెళ్లి సైనిక బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా.. బెరుకు లేకుండా విధుల్లో పాల్గొంటున్నాడు.

అయితే, సైనిక బాధ్యతల్లో ఉన్న ధోని అరుదైన గౌరవం అందుకోబోతున్నాడు. జమ్మూకశ్మీర్ నుంచి విడిపోయి కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పడ్డ లడఖ్‌లో జాతీయ జెండా ఎగుర వేయనున్నాడు. ఆగస్టు 15న లడఖ్‌లోని లేహ్ పట్టణంలో మువ్వన్నెల జెండా ఎగువవేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పుల్వామాలో విధులు నిర్వహిస్తున్న ధోని.. తన బెటాలియన్‌తో కలిసి రేపు లేహ్‌కు వెళ్లనున్నట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ‘ధోని భారత ఆర్మీకి బ్రాండ్ అంబాసిడర్. అతడు తన యూనిట్ సభ్యులను ఉత్సాహపరుస్తున్నాడు. వారితో వాలీబాల్, ఫుట్‌బాల్ కూడా ఆడుతున్నాడు. సైనికులతో కలిసి ట్రైనింగ్ ఎక్సర్‌సైజుల్లో పాల్గొంటున్నాడు. ఆగస్టు 15 వరకు కశ్మీర్‌ లోయలోనే ఉంటాడు’ అని ఓ ఆర్మీ అధికారి తెలిపారు. అయితే, లేహ్‌లోని ఏ చోట ధోని జాతీయ జెండా ఎగురవేస్తాడన్నది తెలియరాలేదు.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...