ధోనీనే కెప్టెన్.. వన్డే, టీ20 సారథిగా మిస్టర్ కూల్..

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో కూడా ధోనీకి అరుదైన గౌరవాన్ని అందించింది. దశాబ్దపు వన్డే, టీ20 సారథిగా ధోనీని ఎంచుకుంది. టెస్టులకు మాత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా నియమించుకుంది.

news18-telugu
Updated: January 1, 2020, 7:27 PM IST
ధోనీనే కెప్టెన్.. వన్డే, టీ20 సారథిగా మిస్టర్ కూల్..
ధోని, కోహ్లీ
  • Share this:
రెండు వరల్డ్ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ, టెస్టుల్లో నంబర్ వన్, ఐపీఎల్‌లో అప్రతిహత విజయాలు.. ఇవీ మిస్టర్ కూల్, మహేంద్ర సింగ్ ధోని సృష్టించిన రికార్డులు. ప్రపంచంలో మరే కెప్టెన్‌కు సాధ్యం కాని చరిత్ర ఇది. మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్.. ధోనినే. భారత క్రికెట్‌కు ‘కూల్’ నాయకుడు. ఎన్నో చరిత్రాత్మక విజయాలు అందించి తనదైన ముద్ర వేసిన లీడర్. అందుకే యావత్తు క్రికెట్ ప్రపంచం ఆయన్ను కొనియాడుతుంది. విమర్శలు ఎదురైనా, ప్రశంసలు కురిపించినా కుంగిపోడు, పొంగిపోడు. తన పనేదో తాను చేసుకొని వెళ్లిపోయే వ్యక్తిత్వం ఉన్నవాడు. అలాంటి ధోని కెప్టెన్సీ నచ్చిన క్రికెట్ ఆస్ట్రేలియా మొన్నీమధ్యే దశాబ్దపు వన్డే కెప్టెన్‌గా ధోనీని ఎంచుకుంది.

ఇప్పుడు, ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో కూడా ధోనీకి అరుదైన గౌరవాన్ని అందించింది. దశాబ్దపు వన్డే, టీ20 సారథిగా ధోనీని ఎంచుకుంది.
టెస్టులకు మాత్రం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని కెప్టెన్‌గా నియమించుకుంది.

First published: January 1, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు