ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా ధోని..

MS Dhoni : మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన గౌరవం అందుకున్నాడు. టీమిండియాకు ఎన్నో చిరస్మరనీయ విజయాలు అందించిన మహేంద్రుడు.. క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ద డికేడ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు.

news18-telugu
Updated: December 24, 2019, 12:34 PM IST
ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కెప్టెన్‌గా ధోని..
మహేంద్ర సింగ్ ధోని
  • Share this:
మిస్టర్ కూల్, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అరుదైన గౌరవం అందుకున్నాడు. టీమిండియాకు ఎన్నో చిరస్మరనీయ విజయాలు అందించిన మహేంద్రుడు.. క్రికెట్ ఆస్ట్రేలియా వన్డే టీమ్ ఆఫ్ ద డికేడ్ కెప్టెన్‌గా ఎన్నికయ్యాడు. తొలి టీ20 కప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ధోనీని ఈ దశాబ్దపు కెప్టెన్‌‌గా ఎంచుకుంది. ధోనితో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కూడా ఆ జట్టులో చోటు సంపాదించుకున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ధోని సేవలను కొనియాడింది. ధోని కాలం భారత్‌కు గోల్డెన్ పీరియడ్ అని, ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని, ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత అతడి సొంతమని ఆకాశానికి ఎత్తేసింది.

కాగా, వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయిన తర్వాత ధోని మళ్లీ బరిలోకి దిగలేదు. అటు.. టెస్టు జట్టును కూడా సీఏ ప్రకటించింది. ఆ జట్టుకు కెప్టెన్‌గా కోహ్లీని ఎంచుకుంది. భారత్ నుంచి ఒక్కడే చోటు దక్కించుకున్నాడు.

సీఏ వన్డే జట్టు : రోహిత్ శర్మ, హాషీం ఆమ్లా, విరాట్ కోహ్లీ, ఏబీ డెవిల్లీర్స్, షకిబ్ అల్ హసన్, జోస్ బట్లర్, మహేంద్ర సింగ్ ధోని(కెప్టెన్), మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, లసిత్ మలింగ, రషీద్ ఖాన్.

సీఏ టెస్టు జట్టు : అలిస్టర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్‌సన్, స్టీవ్ స్మిత్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డెవిల్లీర్స్, బెన్ స్టోక్స్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, నాథన్ లైన్, జేమ్స్ అండర్‌సన్

First published: December 24, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు