ధోని, కోహ్లీ.. యువరాజ్‌కు వెన్నుపోటు పొడిచారు..

సమయం దొరికినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోనిని టార్గెట్ చేసే యోగ్‌రాజ్‌సింగ్.. మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు ధోని వెన్నుపోటు పొడిచాడని సంచలన ఆరోపణలు చేశాడు.

news18-telugu
Updated: May 6, 2020, 1:08 PM IST
ధోని, కోహ్లీ.. యువరాజ్‌కు వెన్నుపోటు పొడిచారు..
ధోని, యువీ, కోహ్లీ
  • Share this:
సమయం దొరికినప్పుడల్లా మహేంద్ర సింగ్ ధోనిని టార్గెట్ చేసే యోగ్‌రాజ్‌సింగ్.. మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. తన కుమారుడు యువరాజ్ సింగ్‌కు ధోని వెన్నుపోటు పొడిచాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఇందులో విరాట్ కోహ్లీకి కూడా భాగం ఉందని మరో బాంబ్ పేల్చాడు. వీరిద్దరు ఎప్పుడూ యువీకి మద్దతు ఇవ్వలేదని అన్నాడు. ‘ధోని, కోహ్లీతో పాటు సెలెక్టర్లు కూడా యువరాజ్‌కు మద్దతు ఇవ్వలేదు. యువీ ఫామ్‌లోకి వస్తే ఎలా? అనే ఆందోళన అందరిలోనూ కనిపించేది. చాలామంది యువీకి వెన్నుపోటు పొడిచారు’ అని యోగ్‌రాజ్‌ కామెంట్ చేశాడు.

గతంలోనూ యువీ కెరీర్‌ను ధోని దెబ్బ తీశాడని ఆరోపించాడు. అయితే, ఈ వ్యాఖ్యలపై యువీని వివరణ కోరగా.. అవి తన తండ్రి వ్యక్తిగత వ్యాఖ్యలు అని, దానిపై మాట్లాడబోనని అన్నాడు. ఇదిలా ఉండగా, కెరీర్ తొలినాళ్లలో ధోని, యువీ సూపర్ జోడీగా ఉండేది. వీరిద్దరు క్రీజులో ఉంటే బౌండరీల మోత మోగేది. మ్యా్చ్ విన్నర్లుగా మారి ఎన్నో చిరస్మరనీయ విజయాలను టీమిండియా సొంతం చేశారు. యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సులు కొట్టినప్పుడు అవతలి ఎండ్‌లో ఉన్నది ధోనీనే. కోహ్లీ కెప్టెన్సీలోనూ ఓ మ్యాచ్‌లో ధోని, యువరాజ్ సెంచరీలతో కదం తొక్కారు. అయితే, యోగ్‌రాజ్ చేస్తున్న వ్యాఖ్యలు ధోని, యువీ అభిమానుల మధ్య వైరం పెంచేలా చేస్తున్నాయి.
First published: May 6, 2020, 1:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading