హోమ్ /వార్తలు /క్రీడలు /

స్టాక్ మార్కెట్లో ధోనీ టీమ్ షేర్ విలువ ఎంతో తెలుసా ?.. రూ.12 పెట్టుబడి ఎంతయ్యిందో తెలుసా ?

స్టాక్ మార్కెట్లో ధోనీ టీమ్ షేర్ విలువ ఎంతో తెలుసా ?.. రూ.12 పెట్టుబడి ఎంతయ్యిందో తెలుసా ?

ఐపీఎల్ లోనే అత్యంత వేల్యూ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ అటు ఆట తీరులోనే కాదు. ఈక్విటీ మార్కెట్లోనూ మదుపరులకు లాభాలను పంచుతోంది.

ఐపీఎల్ లోనే అత్యంత వేల్యూ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ అటు ఆట తీరులోనే కాదు. ఈక్విటీ మార్కెట్లోనూ మదుపరులకు లాభాలను పంచుతోంది.

ఐపీఎల్ లోనే అత్యంత వేల్యూ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ అటు ఆట తీరులోనే కాదు. ఈక్విటీ మార్కెట్లోనూ మదుపరులకు లాభాలను పంచుతోంది.

  ఐపీఎల్ ఫ్రాంచైజీల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ ఏదైనా ఉందంటే అది చెన్నై సూపర్ కింగ్స్ అనే చిన్న పిల్లాడిని అడిగినా ఠక్కున చెబుతారు. వరుసగా మూడు టైటిల్స్ గెలుచుకోవడంతో పాటు దాదాపు ప్రతీ సీజన్ లో ప్లే ఆఫ్స్ వెళ్లడం ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ సత్తాచాటింది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లోనూ ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ చార్ట్ లో టాప్ పొజిషన్ లో నిలిచింది. టీమిండియా మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు పెద్ద అస్సెట్ అనే చెప్పవచ్చు. రెండేళ్లక్రితం స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ చెన్నై సూపర్ కింగ్స్ కమింగ్ బ్యాక్ సీజన్ లో అదరగొట్టే పెర్ఫార్మెన్స్‌తో టైటిల్ సొంతం చేసుకుంది.

  అయితే స్టాక్ మార్కెట్లో సైతం చెన్నై సూపర్ కింగ్స్ షేర్ హోల్డర్లకు లాభాలు తెచ్చిపెట్టే బంగారు బాతు అని నిపుణులు అంటున్నారు. ఇండియా సిమెంట్స్ సంస్థ చెన్నై సూపర్ కింగ్స్ టీంను పది సంవత్సరాలకు గానూ రూ. 364 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అంటే సంవత్సరానికి రూ.36.4కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదర్చుకొని టీమ్ ను సొంతం చేసుకుంది. 2017-18సంవత్సరంతో కాంట్రాక్ ముగియనున్న నేపథ్యంలో 2015, అక్టోబర్ 9న ఇండియా సిమెంట్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును డీమర్జర్ చేశారు. అప్పుడు మొత్తం 94000 మంది షేర్ హోల్డర్లకు 1:1 నిష్పత్తి పద్ధతిలో 10 పైసల ముఖవిలువ కలిగిన షేర్లను కేటాయించారు. అయితే ఇప్పటి వరకూ చెన్నై సూపర్ కింగ్స్ స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ కానప్పటికీ, 2018 నవంబర్లో షేర్ విలువను రూ.12-15గా అంచనా వేశారు. అలాగే 2019 ఏప్రిల్ నాటికి చెన్నై సూపర్ కింగ్స్ షేర్ విలువ ఏకంగా 200 శాతం పెరిగి, రూ.30-35 శాతం పెరిగింది. కోల్‌కతాకు చెందిన అన్ లిస్టెడ్ సెక్యూరిటీ వ్యవహరాలు చూసే అభిషేక్ సెక్యూరిటీస్ చెన్నై సూపర్ కింగ్స్ వేల్యూపై పూర్తి పరిశోధన చేస్తోంది.

  ఐపీఎల్ లోనే అత్యంత వేల్యూ కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ అటు ఆట తీరులోనే కాదు. స్టాక్ మార్కెట్లోనూ మదుపరులకు లాభాలను పంచుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్‌కు సంబంధించిన వేల్యూయేషన్స్ విషయానికి వస్తే చెన్నైకు చెందిన అర్థ కాపిటల్ టీమ్ ఆదాయాన్ని అంచనా వేసింది.చెన్నై సూపర్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ అయిన చేపాక్ స్టేడియంలో టిక్కెట్ల అమ్మకం ద్వారా దాదాపు రూ.27.44 కోట్ల ఆదాయం లభిస్తుంది. అంతే కాదు యావరేజీ ధర కూడా రూ.1000గా నిర్ధారించారు. అయితే మద్రాస్ హై కోర్టు ఆదేశాలతో స్టేడియంలోని సుమారు 50,000 సీట్ల అమ్మకంగా నిషేధం ఉంది. లేకపోతే టిక్కెట్ యావరేజీ ధర రూ. 1750గా ఉండేదని అర్థ కాపటల్ అంచనా వేసింది. అలాగే నిషేధం ఎత్తివేస్తే 2023 సంవత్సరానికి టిక్కెట్ల ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ ఆదాయం ఏటా రూ.60.38కోట్లకు పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది.

  అలాగే చెన్నై సూపర్ కింగ్స్ రెవెన్యూ చూస్తే 2016 ఆర్థిక సంవత్సరం నాటికే రూ.170.93 కోట్లకు పెరగగా, 2009లో ఫ్రాంచైజీ రెవెన్యూ కేవలం రూ.60.6 కోట్లుగా నమోదైంది. అర్థ కాపిటల్ అంచనా ప్రకారం 2019 ఆర్థిక సంవత్సరానికి ఫ్రాంచైజీ రెవెన్యూ దాదాపు రూ.522 కోట్లకు చేరుకోనుంది.

  ఈక్విటీ నిపుణుడు అభిషేక్ సెక్యూరిటీస్ కు చెందిన జినోడియా అంచనా ప్రకారం, ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ మార్కెట్ క్యాపిటల్ రూ.1000కోట్లు అయితే మార్కెట్లో లిస్టింగ్ సమయానికి అది రూ. 2500 కోట్లకు ఎదుగుతుందని పేర్కొన్నారు. శ్రీ మహావీర్ ఇన్వెస్ట్ మెంట్ సైతం ఈ సంవత్సరం చెన్నై సూపర్ కింగ్స్ షేర్ విలువ రూ.50లకు ఎదిగితే, మరో రెండేళ్లలో షేర్ విలువ రూ.100 దాటడం ఖాయమని అంచనా వేసింది.

  First published:

  Tags: Chennai Super Kings, Mahendra singh dhoni, MS Dhoni, Stock Market

  ఉత్తమ కథలు