• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • CRICKET LEGEND SACHIN TENDULKAR HOSPITALIZED AFTER SIX DAYS OF CORONA 19 POSITIVE MUMBAI SK

Sachin Tendulkar: కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్.. పాజిటివ్ వచ్చిన 6 రోజులకు..

Sachin Tendulkar: కరోనాతో ఆస్పత్రిలో చేరిన సచిన్ టెండూల్కర్.. పాజిటివ్ వచ్చిన 6 రోజులకు..

Sachin Tendulkar

ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సరీస్‌లో పాల్గొన్న పలువురు క్రికెటర్లకు కరోనా సోకింది. సచిన్ టెండూల్కర్‌తో పాటు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రినాథ్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

  • Share this:
    క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్ వచ్చిన ఆరు రోజుల తర్వాత ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. "వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరాను. ఆసుపత్రి నుంచి కోలుకున్న వెంటనే తిరిగి వస్తాను. నాకోసం ప్రార్థించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. 2011 ప్రపంచ కప్ 10వ వార్షికోత్సవం సందర్భంగా భారతీయులందరికీ, నా తోటి ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు.'' అని ట్వీట్ చేశారు సచిన్. ఐతే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. ముందుజాగ్రత్తగా ఆస్పత్రిలో చేరారని సన్నిహితులు వెల్లడించారు. అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.


    సచిన్‌ టెండూల్కర్‌ మార్చి 27న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. కుటుంబ సభ్యులకు మాత్రం నెగెటివ్ వచ్చింది. అప్పటి నుంచీ హోమ్‌లో ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. కానీ డాక్టర్ల సలహా మేరకు ఇవాళ ఆయన ఆస్పత్రిలో చేశారు. కాగా, ఇటీవల జరిగిన రోడ్ సేఫ్టీ సరీస్‌లో పాల్గొన్న పలువురు క్రికెటర్లకు కరోనా సోకింది. సచిన్ టెండూల్కర్‌తో పాటు యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, బద్రినాథ్‌కు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది.

    మరోవైపు సచిన్ టెండూల్కర్ హోమ్ టౌన్ ముంబైతో పాటు మహారాష్ట్రవ్యాప్తంగా కరోనా విలయ తాండవం చేస్తోంది. గురువారం ఒక్కరోజే 43,183 కొత్త కేసులు నమోదయ్యాయి. 32,641 మంది కరోనా నుంచి కోలుకోగా.. 249 మంది మరణించారు. నిన్న ఒక్క ముంబై నగరంలోనే 8,646 కేసులు వచ్చాయంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజా కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 28,56,163కి చేరింది. వీరిలో 24,33,368 మంది కోలుకోగా.. 54,898 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రలో 3,66,533 యాక్టివ్ కేసులున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు