రజనీకాంత్‌పై మురళీధరన్ సెటైర్లు... రాజకీయాలపై క్లారిటీ

రాజకీయాల్లోకి వచ్చే విషయంలో సూపర్‌స్టార్ రజనీకాంత్‌లా తాను తికమక పడటం లేదని శ్రీలంక దిగ్గజ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: January 11, 2019, 3:11 PM IST
రజనీకాంత్‌పై మురళీధరన్ సెటైర్లు... రాజకీయాలపై క్లారిటీ
మురళీధరన్, రజనీకాంత్
news18-telugu
Updated: January 11, 2019, 3:11 PM IST
సినీనటులు, క్రికెటర్లలో చాలామంది మెల్లిమెల్లిగా రాజకీయాలపై వైపు రావడం కామనైపోయింది. అయితే కొందరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. అలాంటి వారిలో క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ ఒకరు. శ్రీలంకకు చెందిన మురళీధరన్ రాజకీయాల్లోకి రాబోతున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. మాజీ క్రికెటర్లు రణతుంగ, జయసూర్య వంటి వాళ్లు రాజకీయాల్లోకి రావడంతో... వారి బాటలోనే మురళీధరన్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారనే వార్తలు వినిపించాయి. అయితే ఈ అంశంపై క్లారిటీ ఇచ్చిన మురళీధరన్... తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సెటైర్లు వేయడం చర్చనీయాంశంగా మారింది.శ్రీలంకలో మీడియాతో మాట్లాడిన మురళీధరన్... తనకు రాజకీయాల్లోకి వచ్చే విషయంలో రజనీకాంత్ తరహాలో ఎలాంటి గందరగోళం లేదని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి వచ్చేందుకే తాను సేవా కార్యక్రమాలు చేయడం లేదని వివరణ ఇచ్చారు. తాను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానని... తన సేవా కార్యక్రమాలు మాత్రం కొనసాగుతాయని మురళీధరన్ అన్నారు. మురళీధరన్ రాజకీయాల్లోకి రానని చెప్పడం వరకు ఓకే కానీ... ఈ విషయంలో ఆయన సూపర్ స్టార్ రజనీకాంత్‌పై సెటైర్ వేసినట్టుగా మాట్లాడటం తలైవా ఫ్యాన్స్‌కు అస్సలు మింగుడుపడటం లేదు. ఒకప్పుడు తాను రజనీకాంత్‌కు వీరాభిమానినని చెప్పుకున్న మురళీధరన్... ఇప్పుడు ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతమో వారికి అర్థంకావడం లేదు. దీంతో మురళీధరన్ కామెంట్స్‌పై రజనీకాంత్ అభిమానులు ఏ రకంగా స్పందిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...