క్రీడలు

  • associate partner

Breaking News: యూఏఈ వేదికగా IPL 2020 టోర్నీ...క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్...

IPL 2020 | ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ ఈ ఏడాది టోర్నమెంట్ ను యూఏఈలో నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు, మిగతా సమాచారం అధికారికంగా త్వరలో వెల్లడి కానుంది.

news18-telugu
Updated: July 21, 2020, 7:52 PM IST
Breaking News: యూఏఈ వేదికగా IPL 2020 టోర్నీ...క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్...
ఐపీఎల్ ట్రోఫి
  • Share this:
దేశంలో కరోనా వైరస్ నేపథ్యంలో యూఏఈలో ఐపీఎల్‌ని నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధపడింది. ఐపీఎల్‌ -2020 సీజన్‌కి ఆతిథ్యం ఇచ్చేందుకు ఇప్పటికే యూఏఈ, శ్రీలంక, దక్షిణాఫ్రికా సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ, యూఏఈలో ఐపీఎల్‌ని నిర్వహించడానికి బీసీసీఐ అంగీకరించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ మాట్లాడుతూ ఈ ఏడాది టోర్నమెంట్ ను యూఏఈలో నిర్వహిస్తామని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ వివరాలు, మిగతా సమాచారం అధికారికంగా త్వరలో వెల్లడి కానుంది. అయితే యూఏఈ వేదికగా ఐపీఎల్‌ - 2020 నిర్వహిస్తామని, ఇప్పటికే బీసీసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. కాగా ఐపీఎల్ కు ముందే క్రికెటర్లకి  అబుదాబీ, లేదా షార్జాలో క్యాంప్‌‌ నిర్వహణతో పాటు విదేశీ క్రికెటర్ల వీసాలు, ప్రయాణాలకు సంబంధించి బీసీసీఐ ప్రణాళిక రూపొందించాల్సి ఉంది. విదేశీ ఆటగాళ్లను యూఏఈకి రప్పించడం,ఆ తర్వాత క్వారంటైన్‌లో ఉంచడం వంటి అంశాల దృష్ట్యా ప్రభుత్వం నుండి త్వరగా ఆ దేశం అనుమతి సంపాదించేందుకు బీసీసీఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.ఇక ఐపీఎల్ 2020 సీజన్‌ని దుబాయ్‌లో నిర్వహించనున్నట్లు ఇప్పటికే బీసీసీఐ ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చింది. దీంతో ఆటగాళ్లను తరలించడానికి ప్రత్యేక విమానాలను  అద్దెకు తీసుకోవడం, హోటల్ వసతి సౌకర్యాలపై ఫ్రాంచైజీలు దృష్టి సారించాయి. ప్రభుత్వం నుండి అనుమతి లభించిన వెంటనే ఐపీఎల్‌ షెడ్యూల్, వేదికపై అధికారిక ప్రకటన చేయనుంది. ఐపీఎల్ రద్దయితే బీసీసీఐకి సుమారు రూ.4000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుంది. దీంతో ఎలాగైనా ఐపీఎల్‌-2020 సీజన్ నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది.
Published by: Krishna Adithya
First published: July 21, 2020, 7:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading