కోహ్లీ కాదా.. అతనే ఐపీఎల్‌ సూపర్ కెప్టెన్ అంటున్న అనిల్ కుంబ్లే..

అన్ని జట్లలోంచి తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు మాజీ క్రికెటర్ అనిల్‌ కుంబ్లే. 11 మందితో కూడిన జట్టును ప్రకటించాడు.

news18-telugu
Updated: May 10, 2019, 12:46 PM IST
కోహ్లీ కాదా.. అతనే ఐపీఎల్‌ సూపర్ కెప్టెన్ అంటున్న అనిల్ కుంబ్లే..
అనిల్ కుంబ్లే ( Twitter image)
  • Share this:
ఐపీఎల్ ముగింపు దశకు వచ్చేసింది. ఆటగాళ్లు తమ సామర్థ్యాన్ని బట్టి అభిమానులకు కావల్సినంత పసందు అందించారు. సిక్సులు, ఫోర్లతో బ్యాట్స్‌మెన్ కుమ్మేస్తే.. వికెట్లను గిరాటేస్తూ బౌలర్లు కసి తీర్చుకున్నారు. ఫీల్డర్లు అద్భుతమైన క్యాచ్‌లు, రనౌట్లతో అలరించారు. అయితే, అన్ని జట్లలో చూస్తే కొందరు ఆటగాళ్లు మెరిశారు. వారిలో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులు ఉన్నారు. అయితే, అన్ని జట్లలోంచి తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు మాజీ క్రికెటర్ అనిల్‌ కుంబ్లే. 11 మందితో కూడిన జట్టును ప్రకటించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి తన జట్టు కెప్టెన్ బాధ్యతలు అప్పగించాడు. వికెట్ కీపర్ బాధ్యతలు కూడా కెప్టెన్ కూల్‌కే అందించాడు. కెప్టెన్లుగా కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, ధోని తన దృష్టిలో ఉన్నారని, అయితే వీరిందరిలో ధోనీనే సూపర్ అని వ్యాఖ్యానించారు. రిషబ్ పంత్‌కు కూడా తన జట్టులో చోటిచ్చిన కుంబ్లే.. అతడు మంచి ఫినిషర్‌గా ఎదుగుతున్నాడని ప్రశంసించాడు.

అనిల్ కుంబ్లే ఐపీఎల్ 2019 టీమ్:
ఓపెనర్లు: డేవిడ్ వార్నర్, కేఎల్ రాహుల్

మిడిల్ ఆర్డర్: శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్ కీపర్)
ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, ఆండ్రూ రసెల్


స్పిన్నర్లు: ఇమ్రాన్ తాహిర్, శ్రేయస్ గోపాల్
పేసర్లు: రబాడా, బుమ్రా
First published: May 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>