IPL: నువ్వా..నేనా? ధోనితో సై అంటే సై అంటున్న శ్రేయస్ అయ్యర్..

ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ అయిన ధోని, యంగ్ సంచలనం శ్రేయస్ అయ్యర్ జట్లు ఫైనల్ బెర్తు కోసం సిద్ధమవుతున్నాయి.

news18-telugu
Updated: May 9, 2019, 12:28 PM IST
IPL: నువ్వా..నేనా? ధోనితో సై అంటే సై అంటున్న శ్రేయస్ అయ్యర్..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 9, 2019, 12:28 PM IST
ఐపీఎల్ తుది దశకు చేరుకుంది. క్వాలిఫయర్ 1లో ధోని సేనను ఓడించి రోహిత్ శర్మ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ జట్టు ఫైనల్‌కు చేరగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టి కరిపించి ఢిల్లీ జట్టు క్వాలిఫయర్ 2కు అర్హత సాధించింది. 12 పాయింట్లతో ఫ్లేఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా రికార్డు క్రియేట్ చేసిన హైదరాబాద్, బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఢిల్లీ చేతిలో పోరాడి ఓడింది. 163 పరుగుల లక్ష్యంలో బ్యాటింగ్ ప్రారంభించిన ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్... 19.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. యంగ్ సెన్సేషనల్ ప్లేయర్స్ పృథ్వీషా, రిషబ్ పంత్ అద్భుత ఇన్నింగ్స్‌లతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లో సీఎస్‌కేతో ఢిల్లీ తలపడుతోంది. రేపు సాయంత్రం 7:30కి జరుగనున్న ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.

కాగా, ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌ అయిన ధోని, యంగ్ సంచలనం శ్రేయస్ అయ్యర్ జట్లు ఫైనల్ బెర్తు కోసం సిద్ధమవుతున్నాయి. సీఎస్‌కే గెలిస్తే 8వ సారి ఫైనల్‌లో అడుగు పెట్టిన టీంగా నిలుస్తుంది. అలాగే ముంబైతో ఫైనల్ పోరులో నిలవడం నాలుగవ సారి అవుతుంది. అదే ఢిల్లీ క్యాపిటల్స్ గెలిస్తే ఐపీఎల్ ఫైనల్‌లో తొలి సారి అడుగు పెట్టినట్లు అవుతుంది. ఇదిలా ఉండగా, ఈ ఐపీఎల్‌లో జరిగిన రెండు లీగ్ మ్యాచ్‌ల్లోనూ ఢిల్లీపై చెన్నై విజయం సాధించింది.

First published: May 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...