IPL: ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్ ఓడింది అందుకేనా..

రోహిత్‌ బృందం నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 148/7 స్కోరుకు పరిమితమైంది. వాట్సన్(80) ఒంటరి పోరాటం వృథా అయ్యింది.

news18-telugu
Updated: May 13, 2019, 9:38 AM IST
IPL: ముంబై ఇండియన్స్ చేతిలో చెన్నై సూపర్‌కింగ్స్ ఓడింది అందుకేనా..
ఫైల్ ఫోటో
news18-telugu
Updated: May 13, 2019, 9:38 AM IST
ఐపీఎల్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ జట్టు ఎగరేసుకుపోయింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒకే ఒక్క పరుగు తేడాతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు ఓడిపోయింది. రోహిత్‌ బృందం నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యఛేదనలో చెన్నై 148/7 స్కోరుకు పరిమితమైంది. వాట్సన్(80) ఒంటరి పోరాటం వృథా అయ్యింది. అంతకుముందు ముంబై జట్టు 149/8 స్కోర్ చేసింది. అయితే, చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోవడానికి కారణాలేంటి? ధోనిసేనకు టైటిల్‌ను దూరం చేసిన పరిస్థితులేంటి? అని ఆరాతీస్తే..
1. షేన్ వాట్సన్ రనౌట్: సన్‌రైజర్స్‌తో మ్యాచ్ మినహా అన్ని మ్యాచుల్లో విఫలమైన సీఎస్‌కే ఓపెనర్ షేన్ వాట్సన్ 59 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అయితే, చివరి ఓవర్‌లో రవీంద్ర జడేజాతో సమన్వయం లేక రనౌట్‌గా వెనుదిరిగాడు. మలింగ బౌలింగ్‌లో ఒక రన్ తీసిన వాట్సన్ రెండో బంతికి యత్నించి వికెట్ పారేసుకున్నాడు.
2. బుమ్రా బౌలింగ్: డెత్ ఓవర్లలో తన బౌలింగ్‌తో బ్యాట్స్‌మన్‌కు ముచ్చెమటలు పట్టించే బుమ్రా మరోసారి తనెందుకు ప్రత్యేకమో నిరూపించుకున్నాడు. 17వ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులే ఇచ్చిన బుమ్రా.. 19వ ఓవర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో‌ను పెవిలియన్‌కు పంపించాడు.

3. ధోని రనౌట్: లక్ష్యచేధనలో ధోనిని మించిన బ్యాట్స్‌మన్ లేడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు ప్రత్యర్థులకు గుండెల్లో గుబులే. ఏ క్షణంలో గేర్ మార్చుతాడో, ఏ క్షణంలో డిఫెన్స్ ఆడతాడో చెప్పలేని స్థితి. చివరి ఓవర్లలో బౌలర్ ఎవరైనా సరే బాల్‌ను బౌండరీ దాటించే సత్తా ఉన్న సీఎస్‌కే కెప్టెన్ 13వ ఓవర్‌లో రనౌట్ అయ్యాడు. మ్యాచ్‌కి టర్నింగ్ పాయింట్ ఇదే. ధోని అవుట్ కాకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉంటుందని చెప్పడంలో విశ్లేషకులు ఏమాత్రం సంశయించరు.
4. రాహుల్ చాహర్ 1/14: ఐపీఎల్12 ఫైనల్ మ్యాచ్ రాహుల్ చాహర్ జీవితంలో ఎప్పుడూ గుర్తుండిపోయే రోజు. సీఎస్‌కే బ్యాట్స్‌మన్ రైనాను ఔట్ చేసి, రైనా-వాట్సన్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. నాలుగు ఓవర్లకు కేవలం 14 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టడి చేశాడు.
5. మలింగ ఫైనల్ ఓవర్: అప్పటికే భారీగా పరుగులు ఇచ్చుకున్నా మలింగ మీద నమ్మకంతో రోహిత్ శర్మ బంతిని మలింగకు అందించాడు. యార్కర్లతో వికెట్లను గిరాటేయ గలిగే సత్తా ఉన్న మలింగ చివరి ఓవర్‌లో శార్దుల్ ఠాకూర్‌ను ఎల్బీగా ఔట్ చేసి ముంబైకి టైటిల్‌ను కట్టబెట్టాడు.



First published: May 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...