IPL 2019: కోహ్లీ మీద కోపంతో డోర్ పగులగొట్టాడు.. అంపైర్‌కు రూ.5వేల..

IPL 2019: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మే 4న జరిగిన మ్యాచ్‌లో నోబాల్ వివాదం తలెత్తగా.. మ్యాచ్ అనంతరం అంపైర్ నిగెల్ లాంగ్ అంపైర్ రూమ్ అద్దాన్ని పగలగొట్టడం గమనార్హం.

news18-telugu
Updated: May 7, 2019, 4:40 PM IST
IPL 2019: కోహ్లీ మీద కోపంతో డోర్ పగులగొట్టాడు.. అంపైర్‌కు రూ.5వేల..
కోహ్లీ, అంపైర్ మధ్య వాగ్వివాదం
news18-telugu
Updated: May 7, 2019, 4:40 PM IST
క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నపుడు అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇవ్వడం.. వాటిపై ఆటగాళ్లు అసంతృప్తి వెళ్లగక్కడం లాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. అయితే, ఈ ఐపీఎల్‌లో చోటు చేసుకున్న ఓ ఘటన వెరైటీ. ఓడిపోయామన్న అసహనంతోనో.. లేక ప్రత్యర్థి ఆటగాడి మీద కోపంతోనో ఆటగాళ్లు బ్యాట్లు, రూమ్ డోర్లు విరగ్గొట్టడం చేస్తుంటారు. కానీ, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మే 4న జరిగిన మ్యాచ్‌లో నోబాల్ వివాదం తలెత్తగా.. మ్యాచ్ అనంతరం అంపైర్ నిగెల్ లాంగ్ అంపైర్ రూమ్ అద్దాన్ని పగలగొట్టడం గమనార్హం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్‌లో హైదరాబాద్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఆర్సీబీ బౌలర్ ఉమేశ్ యాదవ్ 20వ ఓవర్‌ వేశాడు. ఆ ఓవర్‌లో ఓ బంతిని ఎలైట్ ప్యానెల్ అంపైర్ నిగెల్ నోబాల్‌గా ప్రకటించాడు.

ఉమేశ్, కెప్టెన్ కోహ్లీ అది నో బాల్ ఎలా ఇస్తారంటూ అంపైర్‌ నిగెల్‌తో వాగ్వాదానికి దిగారు. రీప్లేలో ఉమేశ్ వెనుక పాదం లైన్‌కు వెనుక ఉన్నట్లు కనిపించింది. దీంతో అంపైర్ నిగెల్ తన నిర్ణయాన్ని కొనసాగించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కోపంగా గదికి వెళ్లిపోయిన ఆయన.. కోహ్లీ, ఉమేశ్ తన నిర్ణయాన్ని తప్పుపట్టడం, దురుసుగా ప్రవర్తించడాన్ని తట్టుకోలేక అసహనంతో గది తలుపును గట్టిగా తన్నారు. దీంతో ఆ డోర్ పగిలిపోయినట్లు తెలుస్తోంది. తన తప్పిదాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ)తో చర్చించి తలుపు మరమ్మతుల కోసం అంపైర్ రూ.5వేలు చెల్లించారు. కాగా, ఆటగాళ్లను మందలించాల్సిన అంపైర్లు ఈ విధంగా చేయడాన్ని కేఎస్‌సీఏ తీవ్రంగా తప్పుపడుతోంది. ఈ విషయాన్ని క్రికెట్ పాలక మండలి (సీఓఏ) దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లోనూ నిగెల్ అంపైరింగ్ చేయనున్నట్లు సమాచారం.

First published: May 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...