టీమిండియాకు న్యూ లుక్.. అధికారికంగా ఆరెంజ్ జెర్సీ విడుదల

ICC World Cup 2019: టీమిండియా స్పాన్సర్ నైకీ.. ఈ రోజు జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. ఆ జెర్సీ బ్లూ, ఆరెంజ్ రంగుల మిళితంతో చూడముచ్చటగా కనిపిస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 28, 2019, 6:21 PM IST
టీమిండియాకు న్యూ లుక్.. అధికారికంగా ఆరెంజ్ జెర్సీ విడుదల
టీమిండియా ఆరెంజ్ జెర్సీ
  • Share this:
టీమిండియాకు కొత్త రూపు... ఎప్పుడూ నీలి రంగులో దర్శనమిచ్చే కోహ్లీ సేన ఈ నెల 30న ఇంగ్లండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో ఆరెంజ్ రంగు జెర్సీ ధరించబోతున్న విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు జట్లు ఒకే రంగు జెర్సీలను ధరించడానికి వీల్లేదు. దీంతో ఆతిథ్య ఇంగ్లండ్ బ్లూ జెర్సీనే ధరిస్తుండగా.. భారత్ మాత్రం వేరే రంగు జెర్సీని ధరించాల్సి ఉంది. దీనిలో భాగంగా బీసీసీఐ కోరిక మేరకు టీమిండియాకు ఆరెంజ్ రంగు జెర్సీని కేటాయిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకున్నది. టీమిండియా స్పాన్సర్ నైకీ.. ఈ రోజు జెర్సీని అధికారికంగా విడుదల చేసింది. ఆ జెర్సీ బ్లూ, ఆరెంజ్ రంగుల మిళితంతో చూడముచ్చటగా కనిపిస్తోంది.

అయితే, ఆరెంజ్ రంగును ఎంచుకున్నందుకు కాంగ్రెస్, ఎస్పీ పార్టీలు మోదీ సర్కారును విమర్శించిన సంగతి తెలిసిందే. క్రీడలను కూడా కాషాయీకరణ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏదేమైనా ఎప్పుడూ ‘మెన్ ఇన్ బ్లూ’గా కనిపించే కోహ్లీ సేన.. ఆరెంజ్ రంగు జెర్సీ ధరిస్తుండటం పట్ల క్రీడాభిమానులు ఆసక్తితో ఎదురు చూస్తు్న్నారు. టీమిండియా క్రికెటర్లు కొత్త లుక్‌లో ఎలా ఉంటారో చూద్దామని ఆతృతతో ఉన్నారు.
First published: June 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading