సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం.. కుంబ్లే, ద్రవిడ్ తర్వాత ఆయనే..

Sachin Tendulkar: ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో సచిన్ చోటు సంపాదించాడు. ఈ మేరకు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటన చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 19, 2019, 3:51 PM IST
సచిన్‌ టెండూల్కర్‌కు అరుదైన గౌరవం.. కుంబ్లే, ద్రవిడ్ తర్వాత ఆయనే..
సచిన్ టెండూల్కర్ (ఫైల్)
  • Share this:
భారత క్రికెట్‌ను అందలమెక్కించిన క్రికెటర్.. ఎంతో మంది యువకులకు ఆదర్శం.. ఇంకెంతో మందికి స్ఫూర్తి.. అతడే ది గ్రేట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్. వంద శతకాలు, వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ, ఎవరూ సాధించలేనన్ని పరుగులు,.. ఇలా చెప్పుకుంటూ పోతే సచిన్ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. భారత క్రికెట్ అభిమానులతో ‘క్రికెట్ దేవుడు’ అని అనిపించుకుంటున్న ఈ దిగ్గజం.. వ్యక్తిత్వంలోనూ కింగే. ఎవరినీ పళ్లెత్తు మాట అనని సచిన్.. ఎవరైనా దూషిస్తే తన వ్యక్తిత్వంతోనే జవాబు ఇచ్చే గొప్ప మనసున్నవాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందని అనుకుంటున్నారా? ఆయనకు అరుదైన గౌరవం దక్కింది మరి. ఐసీసీ ఆల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు సంపాదించాడు. ఈ మేరకు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటన చేసింది. మొత్తం ముగ్గురికి చోటు ఇవ్వగా సచిన్‌తో పాటు దక్షిణాఫ్రికా పేస్ దిగ్గజం అలన్ డోనాల్డ్, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ కేథరిన్ ఫిట్జ్‌పాట్రిక్‌కు కూడా చోటు ఇచ్చారు.

కాగా, భారత్ తరఫున ఈ క్లబ్‌లో చేరిన ఆరవ ఆటగాడు సచిన్. అంతకుముందు బిషన్ సింగ్ బేడీ(2009), కపిల్ దేవ్ (2009), సునీల్ గవాస్కర్ (2009), అనిల్ కుంబ్లే (2015), రాహుల్ ద్రవిడ్ (2018) ఉన్నారు. కుంబ్లే, ద్రవిడ్ ఎంపిక జరిగినప్పుడు సచిన్ అభిమానుల నుంచి ఐసీసీ విమర్శలు ఎదుర్కొంది. ఎన్నో రికార్డులు సృష్టించి, 2011 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో ఉన్న ఆటగాడిని ఎందుకు ఎంపిక చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం 87 మంది క్రికెటర్లను ఈ ప్రతిష్ఠాత్మక క్లబ్‌లో చేర్చగా.. అందులో 28 మంది ఇంగ్లండ్, 26 మంది ఆస్ట్రేలియా, 18 మంది వెస్టిండీస్, ఐదుగురు పాకిస్తాన్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా నుంచి తలో ముగ్గురు, శ్రీలంక నుంచి ఒక్కరు చోటు ఉన్నారు.

First published: July 19, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు