India vs West Indies: విరాట్ కోహ్లీ సెంచరీ.. ఇండియా స్కోరు 211/3

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: August 11, 2019, 10:00 PM IST
India vs West Indies: విరాట్ కోహ్లీ సెంచరీ.. ఇండియా స్కోరు 211/3
కోహ్లీ (ట్విట్టర్ ఫోటో)
  • Share this:
వెస్టిండీస్‌తో క్వీన్స్‌పార్క్‌ ఓవల్‌ స్టేడియం వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సెంచరీ సాధించాడు. 112 బంతుల్లో సెంచరీ చేశాడు. అందులో 10 ఫోర్లు, 1 సిక్స్ ఉంది. అటు మరో రికార్డును కూడా అధిగమించాడు. వెస్టిండీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 26 ఏళ్లుగా పాకిస్తాన్‌ దిగ్గజ ఆటగాడు జావెద్‌ మియాందాద్‌(1930) పేరున ఉన్న రికార్డును తిరగరాశాడు. ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత స్కోరు 19 వద్ద కోహ్లీ మియాందాద్‌ రికార్డును సమం చేశాడు. 34 మ్యాచ్‌ల్లోనే 71 సగటుతో ఈ ఘనత సాధించాడు.

మరోవైపు, భారత్ స్కోరు 39.5 ఓవర్లకు 211 పరుగులు చేసింది. మూడు వికెట్లు కోల్పోయింది. ధవన్ (2), రోహిత్ శర్మ(18) రిషబ్ పంత్ (20) నిరాశ పరిచారు. అయితే, కోహ్లీ(108*), శ్రేయాస్ అయ్యర్ (54*) క్రీజులో ఉన్నారు.
First published: August 11, 2019, 10:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading