India vs West Indies: రాణించిన కొహ్లీ, ధోనీ...విండీస్ లక్ష్యం 269

భారత్ భారీ స్కోర్ సాధిస్తుందనుకున్నా...విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. అవసరమైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టి తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు.

news18-telugu
Updated: June 27, 2019, 7:01 PM IST
India vs West Indies: రాణించిన కొహ్లీ, ధోనీ...విండీస్ లక్ష్యం 269
ధోనీ
news18-telugu
Updated: June 27, 2019, 7:01 PM IST
India vs West Indies, ICC Cricket World Cup 2019: మాంచెస్టర్ వన్డేలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ 72, ధోనీ 56, కేఎల్ రాహుల్ 48, హార్ధిక్ పాండ్యా 46 పరుగులతో రాణించారు. ఆఖరులో ధోనీ-పాండ్యా నిలకడగా ఆడారు. ఆరో వికెట్‌కు ధోనీ, పాండ్యా 70 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివరి ఓవర్లో ధోనీ మెరుపులు మెరిపించడంతో కొహ్లీసేన గౌరవప్రదమైన స్కోర్ చేసింది.

భారత్ భారీ స్కోర్ సాధిస్తుందనుకున్నా...విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. అవసరమైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టి తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. రోహిత్ శర్మ 18, విజయ్ శంకర్ 14, కేదార్ జాదవ్ 7 పరుగులు మాత్రమే చేశారు. వీరి ముగ్గురిని కీమర్ రోచ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఆ మూడు క్యాచ్‌లనూ కీపర్ షాయ్ హోప్ పట్టుకోవడం విశేషం. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ మూడు వికెట్లు సాధించాడు. ఇక కెప్టెన్ హోల్డర్, కాట్రెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు.






First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...