India vs West Indies: అజేయ భారత్...మాంచెస్టర్‌లో చిత్తుగా ఓడిన వెస్టిండీస్

ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీతో బరిలో దిగుతోంది కొహ్లీ సేన.

news18-telugu
Updated: June 27, 2019, 10:19 PM IST
India vs West Indies: అజేయ భారత్...మాంచెస్టర్‌లో చిత్తుగా ఓడిన వెస్టిండీస్
టీమిండియా విక్టరీ
news18-telugu
Updated: June 27, 2019, 10:19 PM IST
India vs West Indies, ICC Cricket World Cup 2019: వరల్డ్‌కప్‌లో టీమిండియా విజయాల పరంపర కొనసాగుతోంది. మెగాటోర్నీలో ఓటమి ఎరుగని కొహ్లీసేన మాంచెస్టర్‌లోనూ అద్భుత విజయం సాదించింది. తక్కువ స్కోర్ చేసినప్పటికీ వెస్టిండీస్ జట్టును కట్టడిచేసి చిత్తుగా ఓడించింది. భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడిన విండీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. 34.2 ఓవర్లలో 143 పరుగులు చేసి ఆలౌటయ్యారు. దాంతో 125 పరుగుల తేడాతో గెలిచింది భారత్. ఈ విజయంతో టోర్నీలో హ్యాట్రిక్ విక్టరీ సాధించిన టీమిండియా.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

269 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు ప్రారంభం నుంచే తడపడింది. 10 పరుగులకే కీలమైన గేల్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 16 పరుగుల వద్ద హోప్ ఔటయ్యాడు. అనంతరం పూరన్, ఆంబ్రిస్ క్రీజులో కుదురుకొని వికెట్ పడకుండా జాగ్రతపడ్డారు. 71 రన్స్ వద్ద ఆంబ్రిస్ ఔట్ కావడం..ఆ తర్వాత వరసగా పూరన్, హోల్డర్, బ్రాత్‌వైట్, అలెన్, హెట్‌మైర్, కాట్రెల్ వికెట్లు కోల్పోయి ఆలౌటయింది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లో ఆంబ్రిస్ 31, పూరన్ 28 పరుగులుచేసి పరవా లేదనిపించారు. మిగతా బ్యాట్స్‌మెన్స్‌లో ఎవరూ చెప్పుకోదగ్గర స్కోర్ చేయలేదు.

భారత బౌలర్లలో షమి 4 వికెట్లు పడగొట్టగా..బుమ్రా, చాహల్‌కు చెరో వికెట్లు దక్కాయి. పాండ్యా, కుల్‌దీప్ యాదవ్ సైతం చెరో వికెట్ సాధించారు.


అంతకుముందు 50 ఓవర్లలో భారత్ 7 వికెట్లు కోల్పోయి 268 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కొహ్లీ 72, ధోనీ 56, కేఎల్ రాహుల్ 48, హార్ధిక్ పాండ్యా 46 పరుగులతో రాణించారు. ఆఖరులో ధోనీ-పాండ్యా నిలకడగా ఆడారు. ఆరో వికెట్‌కు ధోనీ, పాండ్యా 70 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. చివరి ఓవర్లో ధోనీ మెరుపులు మెరిపించడంతో కొహ్లీసేన గౌరవప్రదమైన స్కోర్ చేసింది.



భారత్ భారీ స్కోర్ సాధిస్తుందనుకున్నా...విండీస్ బౌలర్లు కట్టడి చేశారు. అవసరమైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టి తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. రోహిత్ శర్మ 18, విజయ్ శంకర్ 14, కేదార్ జాదవ్ 7 పరుగులు మాత్రమే చేశారు. వీరి ముగ్గురిని కీమర్ రోచ్ క్యాచ్ ఔట్ చేశాడు. ఆ మూడు క్యాచ్‌లనూ కీపర్ షాయ్ హోప్ పట్టుకోవడం విశేషం. విండీస్ బౌలర్లలో కీమర్ రోచ్ మూడు వికెట్లు సాధించాడు. కెప్టెన్ హోల్డర్, కాట్రెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది. ఆ మ్యాచ్‌లో ఆరెంజ్ జెర్సీతో బరిలో దిగుతోంది కొహ్లీ సేన.
First published: June 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...