India vs West Indies: దంచి కొట్టిన పొలార్డ్, పూరన్...టీమిండియా లక్ష్యం 316 పరుగులు

కీరన్ పోలార్డ్ మాత్రం విండీస్ స్కోరును 300 దాటించాడు. 7 సిక్సర్లు, 3 బౌండరీలతో పొలార్డ్ 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.

news18-telugu
Updated: December 22, 2019, 5:53 PM IST
India vs West Indies: దంచి కొట్టిన పొలార్డ్, పూరన్...టీమిండియా లక్ష్యం 316 పరుగులు
పొలార్డ్, కోహ్లీ (Image: ICC)
  • Share this:
కటక్ వేదికగా విండీస్‌తో జరుగుతున్న ఫైనల్ వన్డే మ్యాచ్‌లో వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 315/5 పరుగులు చేసింది. విండీస్ బ్యాట్స్‌మెన్ నికొలస్ పూరన్(89), కెప్టెన్ కీరన్ పొలార్డ్ చెలరేగడంతో విండీస్ వేగంగా పరుగులు రాబట్టింది. తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా, విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేసింది. ఓపెనర్లు ఎవిన్ లూయిస్ (21), షాయ్ హోప్‌(42)లను 70 పరుగుల్లోపే ఔట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన విధ్వంసక బ్యాట్స్‌మెన్ హిట్మయిర్ (37) తక్కువ పరుగులకే ఔట్ అయ్యాడు. ఆ తర్వత బ్యాటింగ్ కు దిగిన నికోలస్ పూరన్ మాత్రం దంచికొట్టాడు. బౌలర్లను బెంబేలెత్తించి సెంచరీ ముంగిట అవుటయ్యాడు. 64 బంతుల్లో 10 ఫోర్లు, మూడు సిక్సర్లతో 89 పరుగులు చేసిన పూరన్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో జడేజాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కీరన్ పోలార్డ్ మాత్రం విండీస్ స్కోరును 300 దాటించాడు. 7 సిక్సర్లు, 3 బౌండరీలతో పొలార్డ్ 74 పరుగులతో అజేయంగా నిలిచాడు.

భారత బౌలర్లలో నవదీప్ సైనీ 2 వికెట్లు పడగొట్టగా, షార్దుల్ ఠాకూర్, మహ్మద్ షమి, రవీంద్ర జడేజా చెరో వికెట్ చొప్పున పడగొట్టారు.







కటక్ వేదికగా అరంగేట్రం చేస్తున్న నవదీప్ సైనీ
First published: December 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు