Ind vs WI: విండీస్ లక్ష్యం 289 పరుగులు...చివర్లో కాపాడిన జాదవ్..

తొలి వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 288/8 పరుగులు చేసింది. వరుసగా వికెట్లు పడినప్పటికీ, మిడిలార్డర్ కుదరుకోవడంతో, గౌరవప్రదమైన స్కోరు సాధించగలింది.

news18-telugu
Updated: December 15, 2019, 9:47 PM IST
Ind vs WI: విండీస్ లక్ష్యం 289 పరుగులు...చివర్లో కాపాడిన జాదవ్..
విండీస్ లక్ష్యం 289 పరుగులు...చివర్లో కాపాడిన జాదవ్..(Image: BCCI)
  • Share this:
వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 288/8 పరుగులు చేసింది. వరుసగా వికెట్లు పడినప్పటికీ, మిడిలార్డర్ కుదరుకోవడంతో, గౌరవప్రదమైన స్కోరు సాధించగలింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్.. ఆదిలోనే కీలక బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ బాట పట్టించింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆరు పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఔట్ కాగా.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ(4) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. రోహిత్ శర్మ(36) కొద్దిగా పరుగుల వేట ప్రారంభించినప్పటికీ జోసెఫ్ బౌలింగ్ లో ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలతో రాణించారు. పంత్ 49 బంతుల్లో 50 పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ 70 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఈ క్రమంలోనే 70 పరుగులు చేసి దూకుడుగా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్‌.. జోసెఫ్ బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచ్‌గా చిక్కి ఔట్ అయ్యాడు. శ్రేయస్ అయ్యర్ 88 బంతుల్లో ఒక సిక్స్, 5 ఫోర్లతో అయ్యర్ మొత్తం 70 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత పంత్ దూకుడుకు పొలార్డ్ కళ్లెం వేశాడు. పొలార్డ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన రిషబ్ పంత్ హెట్మయిర్ క్యాచ్ పట్టుకోవడంతో పెవిలియన్ బాట పట్టాడు. పంత్ 69 బంతుల్లో 71 పరుగులు చేశాడు.

ఆ తర్వాత వచ్చిన కేదార్ జాదవ్(40), రవీంద్ర జడేజా(21) చివరి ఓవర్లలో పరుగులు సాధించారు. దీంతో చివరి పది ఓవర్లలో 72 పరుగుల జత అయ్యాయి. దీంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. విండీస్ బౌలర్లలో కాట్రెల్, జోసెఫ్ , కీమో పాల్ చెరి 2 వికెట్స్ పడగొట్టగా, పొలార్డ్ ఒక వికెట్ తీశాడు.
Published by: Krishna Adithya
First published: December 15, 2019, 5:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading