సూపర్ మ్యాన్‌లా కోహ్లీ.. కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టి.. కోపంతో వికెట్ విరగ్గొట్టి..

IND vs SA: కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. డికాక్‌ను అవుట్ చేసేందుకు పట్టిన అద్భుత క్యాచ్.. ఔరా అనిపించేలా చేసింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 19, 2019, 2:57 PM IST
సూపర్ మ్యాన్‌లా కోహ్లీ.. కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టి.. కోపంతో వికెట్ విరగ్గొట్టి..
డైవ్ చేసి క్యాచ్ పడుతున్న కోహ్లీ (AFP)
  • Share this:
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో భారత్ కేవలం మూడు వికెట్ల కోల్పోయి 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 72 నాటౌట్‌), ఓపెనర్ శిఖర్ ధవన్‌ (31 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్‌తో 40)తో రాణించడంతో భారత్ సులువుగానే గెలిచింది. అయితే, కోహ్లీ బ్యాటింగ్‌లోనే కాదు.. ఫీల్డింగ్‌లోనూ మెరిశాడు. డికాక్‌ను అవుట్ చేసేందుకు పట్టిన అద్భుత క్యాచ్.. ఔరా అనిపించేలా చేసింది. దక్షిణాఫ్రికా జట్టులో ఓపెనర్ హెండ్రిక్స్‌ త్వరగానే పెవిలియన్ చేరినా బవుమా(49)తో కలిసి కెప్టెన్ డికాక్‌ (52) రాణించాడు. అయితే, ఆ జోడి ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 12వ ఓవర్లో సైనీ వేసిన బంతిని డికాక్‌ భారీ షాట్ ఆడాడు. అంతే.. అప్పటిదాకా అవకాశం కోసం కాచుకొని కూర్చున్న కోహ్లీ.. చిరుతలా చురుగ్గా కదిలి డైవ్‌ చేసి ఒంటి చేత్తో క్యాచ్‌ అందుకున్నాడు.

కోహ్లీ పట్టిన క్యాచ్‌ను చూసి డికాక్ కూడా షాక్ తిన్నాడు. ఈ క్యాచ్ టీమిండియాకు టర్నింగ్‌ పాయింట్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబందించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అయింది. ఇక మరోవైపు.. ఓ సందర్భంలో కోపంతో వికెట్ కూడా విరగ్గొట్టాడు మన రన్ మెషీన్. అసలేం జరిగిందంటే.. శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్‌లో తడబడటంతో అతనిపై ఆగ్రహంతో ఊగిపోయిన కోహ్లీ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ క్రీజులోకి వచ్చినా వికెట్‌ను గిరాటేశాడు. ఇది వెనక నుంచి చూసిన అంపైర్ ఏమీ అనకుండా అలాగే చూస్తుండిపోయాడు.
Published by: Shravan Kumar Bommakanti
First published: September 19, 2019, 2:57 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading