IND vs SA : రోహిత్ శర్మ మరో సెంచరీ.. టీమిండియా స్కోరు ఎంతంటే..

India Vs South Africa : ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి జోరుమీదున్న టీమిండియా మూడో టెస్టులోనూ రాణిస్తోంది. రాంచీ వేదికగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కాడు.

news18-telugu
Updated: October 19, 2019, 2:37 PM IST
IND vs SA : రోహిత్ శర్మ మరో సెంచరీ.. టీమిండియా స్కోరు ఎంతంటే..
రోహిత్ శర్మ
news18-telugu
Updated: October 19, 2019, 2:37 PM IST
ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి జోరుమీదున్న టీమిండియా మూడో టెస్టులోనూ రాణిస్తోంది. రాంచీ వేదికగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేన ఆదిలోనే మయాంక్ అగర్వాల్‌(10)ను కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన ఛటేశ్వర్ పుజారా డకౌట్ అయ్యి ఘోరంగా నిరాశపరిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(12) కూడా త్వరగానే అవుట్ అయ్యాడు. అయితే, మరో ఎండ్‌లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో వీరవిహారం చేశాడు. వన్డే తరహాలో సిక్సులు, ఫోర్లతో అలరిస్తూ తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. ప్రస్తుతం 108 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. రోహిత్‌కు తోడుగా రహానే(74*) కూడా రాణిస్తున్నాడు. వీరిద్దరు కలిసి 166* పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, ఒక టెస్టు సిరీస్‌లో మూడు సెంచరీలు బాదిన రెండో ఇండియన్ ఓపెనర్‌గా రోహిత్ నిలిచాడు. తొలి టెస్టులో 176, 127 పరుగులు చేసిన రోహిత్ మూడో టెస్టులోనూ సెంచరీతో కదం తొక్కాడు. అంతేకాదు.. ఒక టెస్టు సిరీస్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు.

ఇదిలా ఉండగా, మ్యాచ్ ప్రారంభంలో దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టారు. తొలి రెండు వికెట్లు తీసిన రబాడా నిప్పులు చెరిగే బంతులతో భయపెట్టాడు. అన్‌రిచ్ కూడా ఒక వికెట్ దక్కించుకున్నాడు. అయితే, బంతి పాతబడేకొద్దీ.. రోహిత్, రహానే తమ ప్రతాపాన్ని చూపించారు. దీంతో టీ బ్రేక్ సమయానికి టీమిండియా స్కోరు 205/3గా కొనసాగుతోంది.


First published: October 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...