IND vs SA: రోహిత్ శర్మ దంచేస్తున్నాడు.. టెస్టు ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే..

IND vs SA: విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అలా దిగాడో లేదో.. అర్ధ సెంచరీతో అదరగొట్టేశాడు. టెస్టుల్లోనూ చూడచక్కని క్రికెట్ అభిమానులను సిక్సులతో అలరిస్తున్నాడు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 2, 2019, 12:41 PM IST
IND vs SA: రోహిత్ శర్మ దంచేస్తున్నాడు.. టెస్టు ఓపెనర్‌గా తొలి మ్యాచ్‌లోనే..
రోహిత్ శర్మ
  • Share this:
వన్డేల్లో అతడు బ్యాటు పట్టి బరిలోకి దిగితే బౌండరీలు చిన్నదవుతాయి.. సిక్సులు మోతెక్కిస్తాయి.. సెంచరీలు.. డబుల్ సెంచరీలు అతడి దాసోహం అవుతాయి. అతడే.. రోహిత్ శర్మ. కానీ, టెస్టులకు వచ్చే సరికి జట్టులో చోటు దక్కడం కూడా అతడికి కష్టం. ఐదు లేదా ఆరవ స్థానంలో వచ్చే అతడు.. బ్యాటుకు పని చెప్పింది తక్కువే. అసలు క్రీజులో నిలదొక్కుకున్నది అరుదు. వన్డేల్లోనూ మిడిల్ ఆర్డర్‌లో వచ్చిన రోహిత్.. బాగానే ఆడేవాడు. అయితే, ధోని అతడ్ని ఓపెనర్‌‌గా అవకాశం ఇవ్వడంతో కొత్త చరిత్రలు తిరగరాస్తున్నాడు. ఇప్పుడు టెస్టుల్లోనూ ఓపెనర్ అవతారం ఎత్తాడు.. రోహిత్. విశాఖపట్నంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. అలా దిగాడో లేదో.. అర్ధ సెంచరీతో అదరగొట్టేశాడు. టెస్టుల్లోనూ చూడచక్కని సిక్సులతో క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాడు. మయాంక్ అగర్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ 84 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు.

అటు మయాంక్ అగర్వాల్(41) కూడా రోహిత్‌(58)కు చక్కటి సహకారం అందిస్తున్నాడు. ప్రస్తుతం 35 ఓవర్లకు భారత్ స్కోరు (99/0) వద్ద కొనసాగుతోంది.

First published: October 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు