IND vs SA: దక్షిణాఫ్రికా 431 ఆలౌట్.. అశ్విన్‌కు 7 వికెట్లు..

విశాఖపట్నం వేదికగా జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ మ్యాచ్ మూడో రోజు 385/8 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు మరో 46 పరుగులు జోడించి 431 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 5, 2019, 10:47 AM IST
IND vs SA: దక్షిణాఫ్రికా 431 ఆలౌట్.. అశ్విన్‌కు 7 వికెట్లు..
అశ్విన్‌కు 7 వికెట్లు
  • Share this:
విశాఖపట్నం వేదికగా జరుగుతున్న భారత్, సౌతాఫ్రికా టెస్టు క్రికెట్ మ్యాచ్ మూడో రోజు 385/8 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా నాలుగో రోజు మరో 46 పరుగులు జోడించి 431 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో భారత్‌ 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. మూడో రోజు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ముత్తుసామి (12), కేశవ్ మహరాజ్ (3) క్రీజులో ఉండగా.. ముత్తుస్వామి 33 నాటౌట్‌గా నిలిచాడు. కేశవ్ 9, రబాడా 15 పరుగులు చేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 7 వికెట్లు దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ (160), క్వింటన్ డికాక్ (111) సెంచరీలు సాధించడంతో పాటు, ఎల్గర్, డుప్లెసిస్ 5వ వికెట్‌కు 101 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో దక్షిణాఫ్రికా మంచి స్కోరు చేయగలిగింది.

కాగా, భారత్ తొలి ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ డబుల్ సెంచరీతో పాటు, రోహిత్ వర్మ సెంచరీ చేసి భారత్‌కు భారీ ఆధిక్యాన్ని సాధించి పెట్టిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా, కాసేపటి క్రితమే భారత రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ప్రస్తుతం భారత్ స్కోరు 4/0 గా ఉంది. రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ క్రీజులో ఉన్నారు.
First published: October 5, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading