ధోనీ విషయంలో కోహ్లి నిర్ణయమే టీమిండియా కొంపముంచింది.. : గంగూలీ

మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జడేజా(77),ధోనీ(50) భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేసినా.. చివర్లో మ్యాచ్ ఫలితం తారుమారైంది.

news18-telugu
Updated: July 11, 2019, 8:12 AM IST
ధోనీ విషయంలో కోహ్లి నిర్ణయమే టీమిండియా కొంపముంచింది.. : గంగూలీ
ఎంఎస్ ధోనీ (File Photo)
  • Share this:
ఎన్నో అంచనాల నడుమ 135కోట్ల భారత ఆశలను మోసుకుంటూ సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన టీమిండియా.. కివీస్ చేతిలో పరాజయం పాలైంది. ఊహించని ఈ ఓటమికి భారత క్రికెట్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఫైనల్లో బెర్త్ ఖాయమనుకున్న తరుణంలో.. న్యూజిలాండ్ ముందు మోకరిల్లడం ఫ్యాన్స్‌ను హర్ట్ చేసింది.ఎప్పటిలాగే ఓటమిపై చాలామంది పోస్ట్‌మార్టమ్ మొదలుపెట్టారు. భారత్ ఓటమిని విశ్లేషించిన మాజీ కెప్టెన్ గంగూలీ, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఓటమికి కోహ్లి నిర్ణయాలే కారణమని తేల్చారు.

ధోనీ లాంటి బ్యాట్స్‌మెన్‌ను 7వ స్థానంలో బ్యాటింగ్‌కు పంపించడం తప్పుడు నిర్ణయం అని గంగూలీ, లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. కోహ్లి చేసిన ఈ వ్యూహాత్మక తప్పిదమే(బ్లండర్) టీమిండియా కొంపముంచిందన్నారు. దినేశ్ కార్తీక్,హార్ధిక్ పాండ్యా వికెట్లను చేతిలో ఉంచుకుని.. ధోనిని ముందు బ్యాటింగ్‌కి పంపించాల్సిందని లక్ష్మణ్ అభిప్రాయపడ్డాడు. అలా అయితే రిషబ్ పంత్-ధోనీ కలిసి మంచి భాగస్వామ్యం నెలకొల్పేవారని చెప్పాడు.

ఇలాంటి సందర్భాల్లో లక్ష్య చేధనకు దిగినప్పుడు ధోనీ లాంటి బ్యాట్స్‌మెన్‌ను 7వ నంబర్‌లో బ్యాటింగ్‌కి పంపించవద్దు. ఇంకాస్త ముందుగా అతన్ని బ్యాటింగ్‌కి పంపించాల్సింది. గతంలో జడేజా,పాండ్యా,కార్తీక్ చివరి నాలుగైదు ఓవర్లలో అద్భుతంగా రాణించారు.
సౌరవ్ గంగూలీ,టీమిండియా మాజీ కెప్టెన్


మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. జడేజా(77),ధోనీ(50) భారత్‌ను గెలిపించే ప్రయత్నం చేసినా.. చివర్లో మ్యాచ్ ఫలితం తారుమారైంది. భారత్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తీరు చూస్తే.. అసలు మ్యాచ్‌పై మొదట ఎవరికీ గెలుస్తుందన్న నమ్మకం కలగలేదు. కానీ అనూహ్యంగా జడేజా విజృంభించడం.. ధోనీ క్రీజులో ఉండటంతో అందరిలోనూ ఓ నమ్మకం ఏర్పడింది. అందుకు తగ్గట్టే మ్యాచ్‌ను ఇద్దరు చివరి వరకు లాక్కొచ్చినా.. ఆఖరిలో ధోనీ రనౌట్ కావడంతో మ్యాచ్ కివీస్ చేతిలోకి వెళ్లిపోయింది.
First published: July 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు