Ind vs NZ: రోహిత్ బాదాడు... భారత్ గెలిచింది... సిరీస్‌ సమం...

హాఫ్ సెంచరీతో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసిన రోహిత్ శర్మ... కృనాల్ పాండ్యాకు మూడు వికెట్లు...

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 8, 2019, 8:20 PM IST
Ind vs NZ: రోహిత్ బాదాడు... భారత్ గెలిచింది... సిరీస్‌ సమం...
రోహిత్ శర్మ
Chinthakindhi.Ramu | news18-telugu
Updated: February 8, 2019, 8:20 PM IST
టీ20 సిరీస్ గెలవాలంటే కచ్ఛితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో సమిష్టిగా రాణించి, విజయం సాధించింది టీమిండియా. ఓపెనర్లు మంచి భాగస్వామ్యంలో శుభారంభం అందించగా... ఫినిషర్ ధోనీ తోడుగా, యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తమదైన స్టైల్‌లో మ్యాచ్‌ను ముగించారు. కివీస్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి అధిగమించింది టీమిండియా. రెండో మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో  గెలిచిన టీమిండియా మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. మొదటి మ్యాచ్‌లో విఫలమైన భారత బౌలర్లు, బ్యాట్స్‌మెన్ అంతా తిరిగి ఫామ్‌లోకి రావడం క్రికెట్ అభిమానుల్లో ఆనందం నింపే విషయం. వరుసగా విఫలమవుతూ వస్తున్న రోహిత్ శర్మ... కీలకమైన మ్యాచ్‌లో ఫామ్‌లోకి వచ్చాడు. మొదటి వికెట్‌కి ఓపెనర్లు ఇద్దరూ 9.2 ఓవర్లలో 79 పరుగులు జోడించారు.

తనదైన శైలిలో దూకుడుగా ఆడిన కెప్టెన్ రోహిత్ శర్మ 29 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 50 పరుగులు చేశాడు. అయితే హాఫ్ సెంచరీ ముగిసిన తర్వాతే సోథీ బౌలింగ్‌లో సౌథీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా 31 బంతుల్లో 2 ఫోర్లతో 30 పరుగులు చేసి వెనుదిరిగాడు. 88 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది టీమిండియా... ఈ దశలో క్రీజులో వచ్చిన విజయ్ శంకర్, రిషబ్ పంత్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 8 బంతుల్లో ఓ ఫోరు, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన విజయ్ శంకర్, భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్, ధోనీ కలిసి నిదానంగా ఆడుతూ మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశారు. పంత్ 28 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేయగా... ధోనీ 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 20 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ... టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ప్రస్తుతం 2288 పరుగులతో ఉన్న రోహిత్, న్యూజిలాండ్ ఓపెనర్ గఫ్టిల్‌ను దాటేశాడు.


అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. ఓపెనర్లు టిమ్ సిఫర్ట్ 12 పరుగులు, మున్రో 12 పరుగులు చేసి అవుట్ కాగా ఆ తర్వాత వచ్చిన విలియమ్‌సన్ 20 పరుగులు, మిచెల్ 1 పరుగు చేసి అవుట్ కావడంతో 7.5 ఓవర్లలో 50 పరుగులు చేసి నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది కివీస్. మొదటి పది ఓవర్లలో 60/4 స్కోరుతో ఉన్న కివీస్‌ను గ్రాండ్‌హోమ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డి ఆదుకున్నాడు. వరుస బౌండరీలతో బౌలర్లపై విరుచుకుపడి 11వ ఓవర్‌లో 19 పరుగులు, 12వ ఓవర్‌లో 18 పరుగులు రాబట్టాడు. దీంతో ఐదు ఓవర్లలోనే 60 పరుగులకు పైగా చేయగలిగింది న్యూజిలాండ్ టీమ్.



Cricket, Ind vs Nz, ind vs Nz 2nd T20I, team India cricket, Rohit Sharma Captaincy, Dhoni, hardik pandya, ఇండియా vs న్యూజిలాండ్, క్రికెట్ న్యూస్, క్రికెట్ వార్తలు, న్యూజిలాండ్ టూర్, టీమిండియా, రిషబ్ పంత్, ధోనీ,
కృనాల్ పాండ్యా


ఈ దశలో టీ20ల్లో మొట్టమొదటి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న (28 బంతుల్లో 1 ఫోరు, 4 సిక్సర్లు) గ్రాండ్‌హోమ్‌ను హర్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. ఆ తర్వాత రాస్ టైలర్ కూడా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. 36 బంతుల్లో 3 ఫోర్లతో 42 పరుగులు చేసిన టైలర్... రన్ అవుట్ అవ్వడం కివీస్‌ను దెబ్బ తీసింది. మిచెల్ స్టాన్నర్ 7, సౌథీ 3 పరుగులు, స్కాట్ 2 పరుగులు చేశారు. కృనాల్ పాండ్యాకు మూడు వికెట్లు దక్కగా, ఖలీల్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి. భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలకు చెరో వికెట్ దక్కాయి.



మ్యాచ్ హైలెట్స్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి...

ఇవి కూడా చదవండి
First published: February 8, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...