Ind vs NZ 1st ODI: కివీస్ చేతిలో టీమిండియా తొలి పరాజయం...భారీ స్కోరు చేసినప్పటికీ...

Ind vs NZ 1st ODI: భారత్ నిర్దేశించిన 348 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఛేదించింది. (India vs new Zealand) న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(32), హెన్రీ నికోలస్(72) శుభారంభం ఇవ్వడంతో భారీ లక్ష్య ఛేదన సులువు అయ్యింది.

news18-telugu
Updated: February 5, 2020, 3:59 PM IST
Ind vs NZ 1st ODI: కివీస్ చేతిలో టీమిండియా తొలి పరాజయం...భారీ స్కోరు చేసినప్పటికీ...
India vs New Zealand: కివీస్ చేతిలో టీమిండియా తొలి పరాజయం...
  • Share this:
Ind vs NZ 1st ODI: ఆక్లాండ్ వేదికగా జరుతుగున్న తొలి వన్డే మ్యాచ్ (India vs new Zealand) లో న్యూజిలాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 348 పరుగుల టార్గెట్‌ను న్యూజిలాండ్ ఛేదించింది. న్యూజిలాండ్ ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(32), హెన్రీ నికోలస్(72) శుభారంభం ఇవ్వడంతో భారీ లక్ష్య ఛేదన సులువు అయ్యింది. అనంతరం వచ్చిన రాస్ టేలర్ సెంచరీతో అదరగొట్టగా, టామ్ లాథం (69) పరుగులతో రాణించాడు. అయితే భారత బౌలర్లలో బుమ్రా వికెట్లు తీయడంలో విఫలం చెందాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఊపుమీద ఉన్న టీమిండియా.. తొలి వన్డేలో సైతం అద్భుతంగా రాణించింది. న్యూజిలాండ్‌ బౌలింగ్‌ను చీల్చిచెండాడి 348 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. శ్రేయస్‌ అయ్యర్‌(103), కేఎల్‌ రాహుల్‌ kl rahul (88 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి(51)లు రాణించడంతో భారత్‌ భారీ స్కోరును నమోదు చేసింది. టాస్‌ గెలిచిన కివీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. భారత్‌ ఇన్నింగ్స్‌ను పృథ్వీషా, మయాంక్‌ అగర్వాల్‌లు ఆరంభించారు. తొలి వికెట్‌కు 50 పరుగులు జత చేసిన తర్వాత పృథ్వీ షా(prithvi shaw)(20) ఔట్‌ కాగా, మరో నాలుగు పరుగుల వ్యవధిలో మయాంక్‌ అగర్వాల్‌ (32) పెవిలియన్‌ చేరాడు. ఓపెనర్‌ పృథ్వీషా(20) ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లి సమయోచితంగా బ్యాటింగ్‌ చేసి అర్థ శతకం నమోదు చేశాడు. 61 బంతుల్లో 6 ఫోర్లతో హాఫ్‌ సెంచరీ చేశాడు. శ్రేయస్‌ అయ్యర్‌(Shreyas ayyar)తో కలిసి 102 పరుగుల భాగస్వామ్యాన్ని కోహ్లి నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్థ శతకంతో మెరిశాడు. కాగా, హాఫ్‌ సెంచరీ చేసిన వెంటనే కోహ్లి పెవిలియన్‌ చేరాడు. అయ్యర్‌(Shreyas ayyar) - కేఎల్‌ రాహుల్‌ల జోడి అత్యంత సమన్వయంగా బ్యాటింగ్‌ చేస్తూ.. మంచి బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొంటూనే చెత్త బంతులను బౌండరీలు దాటించారు. అయ్యర్‌ తన వన్డే కెరీర్‌లో మెయిడిన్‌ సెంచరీతో మెరిశాడు.

రాహుల్‌-శ్రేయస్‌ అ‍య్యర్‌ల జోడి 136 పరుగులి భాగస్వామ్యాన్ని జత చేసిన తర్వాత అయ్యర్‌ నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. రాహుల్‌కు కేదార్‌ జాదవ్‌ జత కలిసి స్కోరు బోర్డును మరింత ముందుకు తీసుకెళ్లాడు. జాదవ్‌ 15 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 26 పరుగులు చేయడంతో టీమిండియా నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 347 పరుగులు చేసింది. న్యూజిలాండ్‌ బౌలర్లలో సౌతీ రెండు వికెట్లు సాధించగా,గ్రాండ్‌ హోమ్‌, ఇష్‌ సోథీలకు తలో వికెట్‌ లభించింది.


First published: February 5, 2020, 3:48 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading