India vs Bangladesh: పింక్ బాల్ దెబ్బకు బంగ్లా బేజారు...106 పరుగులకే ఆలౌట్

టీమిండియా బౌలర్లు చెలరేగడంతో బంగ్లా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు.

news18-telugu
Updated: November 22, 2019, 5:19 PM IST
India vs Bangladesh: పింక్ బాల్ దెబ్బకు బంగ్లా బేజారు...106 పరుగులకే ఆలౌట్
వికెట్ తీసిన ఆనందంలో టీమిండియా సభ్యులు
  • Share this:
భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న డే అండ్ నైట్ టెస్టు క్రికెట్ మ్యాచులోలో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లు చెలరేగడంతో బంగ్లా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. భారత బౌలర్ల దెబ్బకు బంగ్లా బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినట్టే వచ్చి వెనుదిరిగారు. ఇషాంత్‌శర్మ బౌలింగ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ కేవలం 50 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. బంగ్లా బ్యాట్స్ మెన్లలలో షాద్మన్ ఇస్లాం(29), లిటన్ దాస్(24), నయీం హసన్ (19) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. టీమిండియా బౌలర్లలో ఇషాంత శర్మ 5 వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్ 3, మహ్మద్ షమీ 2 వికెట్లు పడగొట్టడం విశేషం.
First published: November 22, 2019, 4:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading